Gavaskar blasts indian cricket players

Asia Cup,Virat Kohli,Team India,cricket,Asia Cup title,Indian Sunil Gavaskar, cricket team india,asiacup2014,India vs Pakistan,ODI match,Pakistan beat India, Nayan Mongia

Sunil Gavaskar slammed the Men in Blue for their poor performance against Pakistan and feels that they are not giving their full effort.

మనోళ్ళకు ఆట పై చిత్త శుద్ది లేదు

Posted: 03/04/2014 12:05 PM IST
Gavaskar blasts indian cricket players

ఛాంపియన్ ట్రోఫీ తరువాత వరుస పరాజయాల పాలవుతున్న టీం ఇండియా ఆటతీరు పై రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఆసియా కప్ లో శ్రీలంక పై, పాకిస్థాన్ పై ఓడిన భారత్ ఫైనల్ అవకాశాలను చేజార్చుకోవడంతో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. భారత ఆటగాళ్ళకు ఆట పై చిత్తశుద్ధి దారుణంగా ఉంది. జట్టులో నిబద్దత లోపించింది. అదే జట్టుకు పరాజయాలను అందిస్తోంది.

అసలు ఏమాత్రం ప్రాక్టీస్ చేయడం లేదు. ఐచ్చిక ప్రాక్టీస్ పేరుతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఈ పద్దతి ప్రక్కన పెట్టేయాలి. వరల్డ్ కప్ మరో ఏడాది కూడా లేదు. ఇప్పటి నుండే పరిష్టంగా తయారు కావాల్సిన జట్టు ఇంత పేవల ప్రదర్శన చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని టోర్నీల్లో మిశ్రమ ఫలితాలు చూడాల్సి వస్తుంది. 

హోటల్ గదుల్లో ఉండడానికో, షాపింగ్ చేయడానికో వారు రాలేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ విషయంలో అలసత్వంగా ఉండటం బాధేస్తుందని అన్నాడు. మరి సన్నీ కామెంట్స్ విన్న తరువాత అయినా మేనేజ్ మెంట్ లో, ఆటగాళ్ళ తీరులో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles