Virat kohli wants yuvraj singh for rcb

ipl 7 auctions, indian premier league, ipl 2014, virat kohli, yuvraj singh, ipl auctions, royal challengers bangalore, rcb, ipl franchise, Kohli,Royal Challengers Bangalore,Kings XI Punjab

Royal Challengers Bangalore (RCB) skipper Virat Kohli is keen to get veteran Indian cricketer Yuvraj Singh in his squad.

యువీ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు

Posted: 01/17/2014 01:50 PM IST
Virat kohli wants yuvraj singh for rcb

ఫాంలో ఉన్న పెద్దా, చిన్న ఆటగాళ్ళకు కాసులు కురిపిస్తున్న ఐపీఎల్ వేళానికి మళ్ళీ సమయం ఆసన్నమైంది. వచ్చేనెల 12, 13 తేదీలలో జరగనున్న ఈ వేలంలో పలువురు ఆటగాళ్ళు పాల్గొనబోతున్నారు. త్వరలో జరగబోయే ఈ వేలంలో అందరి చూపు భారత స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ పై పడింది.

గత సీజన్లో పూణె వారియర్స్ తరుపున ఆడిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో ఈసారి జరిగే వేలంలో యువీని దక్కించుకోవడానికి చాలా ప్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ యువీని ఎంతైనా పెట్టి కొనుక్కోవడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్ సీబీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. కోహ్లీ ఇంత చొరవ చూపడానికి కూడా ఓ కారణం ఉంది.

టి 20ల్లో చెలరేగి ఆడే యువీని తమ జట్టులోకి తీసుకుంటే ఇప్పుడున్న బ్యాటింగ్ కి తోడు మరింత బలం వచ్చి చేరుతుందని భావిస్తున్నారు. అంతే కాకుండా అతని లెఫ్టార్మ్ స్పిన్, చురుకైన ఫీల్డింగ్ జట్టుకు మరింత బలం. ఇప్పటి వరకు మొత్తం 68 ఇన్నింగ్స్‌లలో 25.00 సగటుతో 1475 పరుగులు చేశాడు. 130.76 స్ట్రైక్ రేట్ ఉన్న యువీ...లీగ్‌లో ఇప్పటి వరకు 82 సిక్సర్లు బాదాడు. కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగితే వేలంలో యువీకి తిరుగుండదు. అదీ కాకుండా ఈ సారి వేలంలో ఆటగాళ్ళ రేటు పై ఆంక్షలు తొలగించింది. ఇలాంటి తరుణంలో యువీకి భారీగానే జాక్ పాట్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles