Yuvraj singh dropped new zealand tour odi

Yuvraj Singh,Stuart Binny,Ishwar Pandey,Indian ODI squad,India vs New Zealand, outh Africa

All-rounder Yuvraj Singh was on Tuesday axed from India ODI squad owing to his poor performance in South Africa.

యువీకి మొండిచేయి, కొత్త వాళ్ళకు ఛాన్స్

Posted: 12/31/2013 08:02 PM IST
Yuvraj singh dropped new zealand tour odi

న్యూజిలాండ్ తో వన్డే, టెస్టు సిరీస్ కి బీసీసీఐ నేడు భారత జట్టు ఎంపిక చేసింది. జనవరి 19 వ తేదీ నుండి వన్డే సిరీస్  ప్రారంభం కానుంది. ఆ తరువాత టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈసారి ఎంపికలో కొత్త వారికి స్థానం కల్పిస్తూ... జట్టులో ఫాంలోని ఆటగాళ్ళకు ఉద్వాసన పలికింది.

క్యాన్సర్ ని జయించి తిరిగి జట్టులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ సౌత్ ఆఫ్రికా జట్టులో వరుస వైఫల్యం చెందటంతో ఆయనకు పక్కకు పెట్టింది. యువరాజ్ సింగ్ కి వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. అతడి స్థానంలో కర్ణాటక ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. వన్డేలో పూజారాకు కూడా హ్యాండ్ ఇచ్చి, టెస్టులో స్థానం కల్పించారు. బౌలర్ మొహిత్ శర్మకు మొండిచేయి చూపారు. అతడి స్థానంలో పేసర్ వరుణ్ ఆరోన్ను తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సీమర్ ఈశ్వర్ పాండే 'డబుల్' సాధించాడు. వన్డే, టెస్టు టీమ్లో అతడు చోటు సంపాదించాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు.

వన్డే టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానే, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే.

టెస్టు టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles