South africa win 2nd test kallis perfect send off

Test series, Team India, South Africa-India Test Match, Test Cricket, Aginkya Rahane, Test series, Team India, South Africa-India Test Match,Jacques Kallis, Dale Steyn, Ajinkya Rahane, South Africa v India at Durban, India tour of South Africa, India cricket, South Africa cricket

South Africa overpowered India by ten wickets in Jacques Kallis final Test to give one of the greatest of Test careers the perfect end.

సిరీస్ గెలిచారు - కల్లీస్ గ్రాండ్ సెండాఫ్ ఇచ్చారు

Posted: 12/30/2013 08:57 PM IST
South africa win 2nd test kallis perfect send off

దక్షిణాఫ్రికా టూర్లో భారత్ ఒక్క సిరీస్ కూడా సాధించకుండా వెనుదిరగబోతుంది. వన్డే సిరీస్ ని ఘోరంగా ఓడిపోయిన ధోని సేన టెస్టు సిరీస్ ను కూడా కోల్పోయింది. మొదటి టెస్టును డ్రా ముగించి సిరీస్ పై ఆశలు పెంచిన టీం ఇండియా రెండో టెస్టులో చేతులెత్తేసింది.

దక్షిణాఫ్రికాతో నేడు ముగిసిన రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 1-0తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. టీం ఇండియా నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 11.4 ఓవర్లలో ఛేధించి వియాన్నందుకుంది. స్మిత్ 27, పీటర్సన్ 31 పరుగులు చేశారు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో ధోని సేన  223 పరుగులకు ఆలౌటయింది. అజింక్య రహానే ఒక్కడే రాణించి 96 పరుగులు చేశాడు.  కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. తొలి టెస్టు శతకం సాధిస్తాడనుకున్నాఫిలాండర్ బౌలింగ్లో అవుటయ్యాడు.

మిగతా ఆటగాళ్లు ధావన్ 19, విజయ్ 6, పూజారా 32, కోహ్లి 11, రోహిత్ శర్మ 25, ధోని 15, జడేజా 8, జహీర్ ఖాన్ 3 పరుగులు చేసి విఫలమయ్యారు.  స్టెయిన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, డీవిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అందుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles