South africa hammer india by 134 runs to win series

South Africa won 134 runs, quinton de kock, hashim amla, dale steyn, lonwabo tsotsobe, mohammad shami, ms dhoni, south africa vs india 2013 14

Quinton de Kock and Hashim Amla scored centuries as South Africa beat India by 134 runs in Durban to win their one-day. international series

రెండో వన్డేలో చిత్తు చిత్తుగా

Posted: 12/09/2013 03:08 PM IST
South africa hammer india by 134 runs to win series

పొరుగు గడ్డ పై భారత్ ఆట అంతంత మాత్రమే అని మరోసారి తేలిపోయింది. మొదటి వన్డే ఓటమితో గుణపాఠం నేర్చుకుంటారేమో, రెండో వన్డేలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడతారేమో అనుకున్నారు కానీ మనవాళ్ళ తీరులో ఏ మాత్రం మార్పు కనిపించక పోవడంతో రెండో వన్డేలో ఘోరాతి ఘోరంగా ఓడారు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డ పై సిరీస్ కోల్పోయింది. కింగ్స్ మిడ్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 134 పరుగల తేడాతో ఓటమి చవి చూసింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను కొంత మేరకు కట్టడి చేశారు.

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. కాక్ (118 బంతుల్లో 106; 9 ఫోర్లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేయగా... హాషిం ఆమ్లా (117 బంతుల్లో 100; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు ఏకంగా 194 పరుగులు జత చేసి తమ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన భారత ఆటగాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళడంతో కేవలం 35.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా తరఫున రైనా (50 బంతుల్లో 36; 3 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సోట్సోబ్ (4/25) జట్టును దెబ్బ తీశాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ క్వాంటన్ డి కి దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం సెంచూరియన్‌లో జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles