Australia wins 2nd ashes test by 218 runs

Australia wins 2nd Ashes test , 2nd ashes test, adelaide, england, australia, ashes 2013 14, 2nd Ashes test win by 218 runs

Australians finished off England in 11 overs Monday to win the second Test by 218 runs and take a 2-0 series lead.

కుక్ సేనను కంగారెత్తించారు

Posted: 12/09/2013 02:30 PM IST
Australia wins 2nd ashes test by 218 runs

ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో కంగారుల చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైయింది. రెండు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టెస్టు సిరీస్ లో మొదటి టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ ఇందులో కూడా ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి కుక్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 101.4 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటయింది. రూట్(87), ప్రయర్(69), పీటర్సన్(53) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది.

తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోరు 570/9 డిక్లేర్డ్ కాగా, ఇంగ్లండ్ 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు132/3 వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 218 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపిచారు. ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4, హరీస్ 3 వికెట్లు పడగొట్టారు. జాన్సన్, లియన్, స్మిత్ తలో వికెట్ తీశారు. మొత్తం 8 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాన్సన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో ఆసీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles