Sania Mirza replies Rajdeep Sardesai over a casually question

Sania mirza leaves rajdeep sardesai issue as he says sorry

sania mirza, rajdeep sardesai, tv interview, ace against odds, journalist sorry sania mirza, sania mirza rajdeep sardesai, tennis, marriage, autobiography, hyderabad

Indian Tennis star Sania Mirza replies Rajdeep Sardesai over a casually sexist question, and leaves the issue as journo says sorry.

సారీతో అ ఆంశాన్ని వదిలేసిన సానియా.. గ్రేట్..!

Posted: 07/15/2016 05:46 PM IST
Sania mirza leaves rajdeep sardesai issue as he says sorry

రిలీజ్‌ను పురస్కరించుకుని ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఆత్మకథ ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ పుస్తకం రాసిన వేళా విశేషం ఏమాత్రం బాగోలేనట్టుంది. ఆ పుస్తకం అవిష్కరణ సమయంలో సానియా మిర్జా అప్పుడే తన అటోబయోగ్రఫీ  రాసేంత పెద్దదయ్యిందని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా పుస్తక అవిష్కరణ సందర్భాన్ని పురస్కరించుకుని పాపులర్ న్యూస్ ప్రెజెంటర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు షాకిచ్చారు.

తల్లెప్పుడౌతావ్, జీవితంలో ఎప్పుడు స్థిరపడతావ్ అని రాజ్‌దీప్ ప్రశ్నించడంతో సానియా కన్నెర్ర చేశారు. తాను సాధించిన మెడళ్లు కనపడటం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే జరిగిన ఘటనను రాద్దంతం చేసి.. అక్కడున్న తన అభిమానులతో జర్నలిస్టుపై తిరగబడేలా చేయకుండా చాలా సంయమనంతో, సహనంతో, శాంతితో, క్షమాగుణంతో వ్యవహరించారు. అయితే అమె చూపిన క్షమాగుణం ముందు ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ కు తప్పును తెలుసుకునేలా చేసింది.

ఆలస్యంగా తన తప్పును అర్థం చేసుకున్న రాజ్‌దీప్ సర్దేశాయ్‌ ఏమాత్రం అలోచించకుండా సానియా మీర్జాకు క్షమాపణ చెప్పారు. తాను ఇప్పటి వరకూ పురుష క్రీడాకారులను కూడా అడగని ప్రశ్న అడిగినందుకు తనను క్షమించాలని కోరారు. అంతే అంతటితో కరిగిపోయిన సానియా.. ఓ ప్రముఖ జర్నలిస్టుతో సారీ చెప్పించుకోగలిగానంటూ ఆమె సరదా వ్యాఖ్యానించి ఈ అంశాన్ని చాలా ఈజీగా తీసుకుంది. దీంతో కథ సుఖాంతమైంది. లేకపోతే రాజ్‌దీప్ సంగతి ఏమయ్యేదో!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  rajdeep sardesai  tv  tennis  marriage  autobiography  hyderabad  

Other Articles