క్రికెట్ దేవుడు మాస్టర్ కి తన పుట్టిన రోజు నాడు ముంబయి జట్టు బర్త్ డే గిఫ్ట్ గా ఘన విజయాన్ని అందించింది. ఉదయం నుండి బర్త్ డే వేడుకల్లో సందడిగా గడిపిన సచిన్ కి సాయంత్రం జట్టు విజయాన్ని అందించి మరింత సంతోషాన్ని పంచారు. కొల్ కత్తాలో నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి విజయం సాధించింది. సొంత మైదానంలో నైట్ రైడర్స్ కథ మాత్రం మారలేదు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తాకి ఆరంభం బాగానే లభించి, 159 పరుగుల భారీ స్కోరు సాధించినా విజయాన్ని మాత్రం దక్కించుకోలేక పోయింది. సరికొత్త మార్పుతో యూసఫ్ పఠాన్‌తో ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్న గంభీర్ 26 పరుగులు చేయగా.. ఆరంభంలోనే సిక్స్, ఫోర్లుతో వీరంగం చేసిన పఠాన్ వ్యక్తిగత 19 పరుగులకే వెనుదిరిగినా, మిడిలార్డర్‌లో కల్లీస్ 37, తివారీ 33, మోర్గాన్ 31 పరుగులు చేసి ముంబై బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్ని భారీ లక్ష్యాన్ని ముంబయి ముందు ఉంచారు.
అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మిత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 62 పరుగులు సాధించాడు. బర్త్ డే బాయ్ సచిన్ (2) నిరాశ పరిచినా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ 34, పొలార్డ్ 33, పరుగులు చేయరు.. చివర్లో రాయుడు 13, హర్భజన్ 7 పరుగులతో అజేయంగా నిలిచి మరో బంతి మిగిలి ఉండగానే ముంబైకి విజయాన్ని అందించారు. దీంతో ముంబయి పరాజయాలకు బ్రేక్ పడింది. ముంబయి జట్టుకు మొదటి సారి కెప్టెన్ గా వ్యవహరించిన రోహిత్ శర్మ తొలి కెప్టెన్ గా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more