Master blaster sachin tendulkar turns 40

Happy birthday Sachin Tendulkar, Sachin Tendulkar at 40, Tendulkar 40th birthday,Facts and figures, rare images, quotes, cricketing icon, Sachin Tendulkar, Sachin Tendulkar, Sachin Tendulkar happy Birthday, Sachin unseen moments

Master Blaster Sachin Tendulkar turns 40

40 వసంతాల లిటిల్ మాస్టర్

Posted: 04/24/2013 09:03 PM IST
Master blaster sachin tendulkar turns 40

భారత క్రికెట్ దేవుడు, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేష్ టెండూల్కర్‌కు 40 సంవత్సరాలు నిండాయి. ఈరోజు ఆయన తన 40వ పుట్టిన రోజును కోల్ కత్తాలో అభిమానులను మధ్య, కుటుంబసభ్యల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. ఈ 40 ఏళ్ల వయసుకు గుర్తుగా సచిన్ 40 కిలోల కేక్‌ కట్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్ 24 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంలో సచిన్ తీపి చేదు మజిలీలను ఓసారి గుర్తు చేసుకుందాం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం సచిన్‌ది. 1973 ఏప్రిల్ 24న ముంబైలో రమేష్, రజనీలకు జన్మించిన సచిన్ ఇప్పటికే టెస్ట్ సిరీస్, వన్డేలు రెండింటిలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. సచిన్ ఓ వ్యక్తిగా, ఒక ఆటగాడిగా, భారతీయుడిగా ఎంతో కీర్తి పొందాడు. మాస్టర్ బ్లాస్టర్ - లిటిల్ మాస్టర్ - క్రికెట్ దేవుడు - క్రికెట్ ఎవరెస్ట్......సచిన్కు అభిమానులు పెట్టుకున్న ముద్దు పేర్లు. క్రికెట్ కోసమే పుట్టిన మాస్టర్ క్రికెట్టే శ్వాసగా బతుకుతున్నాడు.

పదహారేళ్ళ వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్ అంచలంచెలుగా క్రికెట్ లో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. అతను తన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన రాత్రులు ఉన్నాయి. ఇక క్రికెట్ చరిత్రలలో ఉన్న దిగ్గజాలలో ఆయన్ను పొగడ్తలతో ముంచని వారులేరంటే అతిశయోక్తి కాదు. ఇక అభిమానులు అయితే సచిన్ లేని క్రికెట్ ని ఊహించుకోలేనంతగా , క్రికెట్ చరిత్రలో ఎవరూ అందుకోలేనన్ని సెంచరీలతో, రికార్డులతో ముందంజలో ఉన్నాడు. ఇప్పటికి ఆయన 198 టెస్టులు, 463 వన్డేలు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇంకా సచిన్ గురించి పూర్తిగా చెప్పుకుంటూ మాటలు చాలవు. అయితే 40 ఏళ్లు నిండిన మాస్టర్‌ ఇంకెంత కాలం క్రికెట్‌ ఆడగలడని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

సచిన్ క్రికెట్లో ఎంతటివాడైనా విరమణ ప్రకటించక తప్పదు. ఆ దశ దగ్గరకొచ్చేసింది. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సచిన్ టెస్టుల్లోనూ కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడు. ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది గానీ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి కూడా సచిన్ తప్పుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ తరువాత దక్షిణాప్రికా టెస్టు సిరీస్ చివరిది అనే మాటలు చాలా మంది నోటి నుండి వస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ పై నిర్ణయం తనకే వదిలేడం సగటు అభిమానులుగా మనం చేయాల్సిన పని. కానీ ఆడినంత కాలం ఇలాగే అభిమాల్ని అలరించాలని మనసారా కోరుకుంటూ.... తెలుగు విశేష్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more