ఐపీఎల్ సీజన్ - 6 ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించి ఐపీఎల్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. కానీ రెండో మ్యాచ్ లో తన హవాని కొనసాగించలేక చితికల పడింది. నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఐపీఎల్‌లో లోప్రొఫైల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హై వోల్టేజ్ ప్రదర్శనతో అదరగొట్టింది.. టాస్ గెలిచి ఫీల్టింగ్ ఎంచుకున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ ని ఏ మాత్రం కట్టడి చేయలేక పోయింది. రహానే, బ్రాడ్ హెడ్జ్ మెరుపు బ్యాటింగ్ కి రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. అనంతరం 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆదిలోనే తడబడి బిస్లా (1), కల్లీస్ (0)ల వికెట్లను కోల్పోయింది. అనంతరం తివారీ (14)తో కలిసి కొంత నిలకడగా ఆడిన గంభీర్ వ్యక్తిగత 22 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో శుక్లా, కూపర్‌లు వెంటవెంటనే గంభీర్, పఠాన్ వికెట్లను పడగొట్టి రైడర్స్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓ క్రమంలో 56 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా మరో 69 పరుగుల తేడాతో మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయి చివరి ఓవర్ మిగిలి ఉండగానే కుప్పకూలింది. దీంతో రాయల్స్‌కు 19 పరుగుల తేడాతో విజయం దక్కింది. కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన త్రివేదికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రుసగా రెండో విక్టరీని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థాయంలో నిలిచింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more