కాలం కలిసిరాకపోతే... కర్రే పామైకరుస్తుందని ఓ సామెత ఉంది. ఈ సామెత నిన్న పాక్ తో జరిగిన తొలి వన్డేలో ఇండియాకి అతికినట్లు సరిపోతుంది. అసలే మన బ్యాట్స్ మెన్స్ వరుసగా క్యూ కట్టడంతో తక్కువ స్కోరుకే చాపచుట్టేస్తారనుకున్నారు. కానీ ధోని మహిమ చేసి, ఒంటిచేత్తో భారత్ కి గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. దీంతో ఇండియా గెలుస్తుందనే చిన్న ఆశ అభిమానుల్లో ఉండింది. కానీ వాటి పై మన దేశానికి చెందిన ఎంపైర్ నీళ్ళు చల్లాడు. దీంతో భారత్ ఓటమికి తనవంతు సహాకారన్ని అందించాడు. కెరీర్లో మూడో అంతర్జీతీయ మ్యాచుకు రవి ఎంపైర్‌గా నిన్న వ్యవహరించాడు.
పాక్ విజయంలో సెంచరీతో చెలరేగి కీలక పాత్ర పోషించిన జంషెడ్ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావాల్సింది. కానీ రవి తప్పుడు నిర్ణయంతో బతికిపోయాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జంషెడ్ బ్యాట్ లోపలి అంచుకు తాకిన బంతి ప్యాడ్లకు తగిలి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న సెహ్వాగ్ చేతిలో పడింది. తొలుత ఎల్బీడబ్ల్యు.. ఆ తర్వాత క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేసిన అంపైర్ రవి తోసిపుచ్చాడు. అప్పటికి జంషెడ్ 24 మాత్రమే. ఆ తర్వాత 24వ ఓవర్లో అశ్విన్ బౌలింగులో యూనిస్ ఖాన్ క్లీన్ స్వీప్‌కు ప్రయత్నించగా బంతి బ్యాడ్లకు తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేస్తే అంపైర్ దాన్ని కూడా తోసిపుచ్చాడు. రీప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లుగా స్పష్టంగా తేలింది. ఎవరి వైఫల్యమైనా కానీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి మాత్రం వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more