రాష్ట్ర రాజధాని నగరం క్రీడా శోభను సంతరించుకుంది. జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ సందడి ఎల్బీ స్డేడియంలో మొదలైపోయింది. నేటి నుంచి నవంబర్ 4 వరకు నగర బాక్సింగ్ అభిమానులను ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఇందుకుగాను స్టేడియంలో ప్రత్యేకంగా రెండు బాక్సింగ్ రింగ్‌లను ఏర్పాటు చేశారు. దాదాపు 12,000 మంది ప్రేక్ష కులు ప్రత్యక్షంగా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం కోచ్, మేనేజర్ల సమావేశాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య కార్యదర్శి రాజేశ్ భండారి నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు స్టీల్ ప్లాంట్, రైల్వేస్, సర్వీసెస్, ఆలిండియా పోలీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 36 జట్ల నుంచి సుమారు 350 మంది బాక్సర్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ పోటీలను ఆరంభించారు. జాతీయ బాక్సర్, ఖేల్ రత్న అవార్డు గ్రహీత విజేందర్ సింగ్ ఈ పోటీలకు ప్రత్యేక అతిథిగా రానున్నాడు.
కాగా, తమిళనాడులో జరిగిన గత టోర్నీలో విజేత, రన్నరప్‌లుగా నిలిచిన రైల్వేస్, సర్వీసెస్ జట్లకు చెందిన బాక్సర్లు ఈసారి హాట్ ఫేవరెట్‌లుగా బరిలోకి దిగనున్నారు. ఈ పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్ హోదాలో మంత్రి దానం నాగేందర్ గత వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇక్కడ సీడింగ్‌లు లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయి బాక్సర్లు తొలి రౌండ్‌లో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సూపర్ హెవీ వెయిట్‌లో జాతీయ యూత్ స్వర్ణ పతక విజేత త్రివిక్రమ్ దేవ్‌పైనే గంపెడు ఆశలు ఉన్నాయి. ఇతనితో పాటు లోకేష్ రాజ్ (మిడిల్ వెయిట్), సురేందర్ (వెల్టర్ వెయిట్) కూడా చక్కని ప్రతిభ ఉన్న బాక్సర్లుగా ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more