వరల్డ్ కప్ తరువాత అంతంత మాత్రంగానే విజయాలు అందుకుంటున్న ధోని సేన దక్షిణాఫ్రికాలో భారతీయలు స్థిరపడి 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఏకైక టీ20 కోసం దక్షిణాఫ్రికా చేరుకుంది. ఈ మ్యాచ్ రేపు అనగా (30వ) తారీఖున జరుగనుంది. ఒక్క మ్యాచ్ కోసం అంత దూరం వెళ్లితే అలసట రాదా అని ధోనిని అడిగితే నాకు అసలట సమస్యే కాదని సమాధానం ఇచ్చాడు. మరో వారం రోజుల్లో జరుగనున్న ఐపీఎల్ సీజన్ కి ముందు ధోని సేన ఒక్క మ్యాచ్ కోసం అదీ టీ 20 కోసం వెళ్ళడం ఆశ్చర్యమే.
దక్షిణాఫ్రికా నుంచి రాగానే టీమిండియా క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన టీమిండియా.. ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలసట సమస్యే కాదని భావిస్తున్నాను. దేశం తరఫున కాకుండా జట్టుగా ఆడే ఏకైక టోర్నీ ఐపీఎల్.. ఐపీఎల్ యువకులకు మంచి వేదిక. ఎందుకంటే అంతర్జాతీయ ఉత్తమ ఆటగాళ్లతో ఆడే అవకాశం ఈ టోర్నీలో మాత్రమే యువకులకు లభిస్తుంది. అంతేకాదు.. ఫిట్‌నెస్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది' అని ధోనీ చెప్పాడు. అయితే భారత అభిమానులు మాత్రం ఈ మధ్య కాలంలో ఏమంత కష్టపడి ఆడి కప్ లు సాధించారు గనుక వారికి అలసట వస్తుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more