బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో మార్చి 11 తేది నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులున్న భారత్ జట్టును జాతీయ సెలెక్టర్లు బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. వీరేంద్ర సెహ్వాగ్, ఉమేష్ యాదవ్, జహీర్ ఖాన్‌లకు విశ్రాంతి కల్పించారు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన రోహిత్, రవీంద్ర జడేజాలను జట్టులోకి తీసుకున్నారు. చెప్పుకోదగ్గ మార్పులు లేకుండానే జట్టును ఎంపిక చేశారు. సచిన్ జట్టులోకి తీసుకోవడం, విరాట్ కోహ్లీకి వైస్ కెప్టెన్ బాధ్యతల్ని అప్పగించడం విశేషం. బెంగాల్ బౌలర్ అశోక్ దిండా, యూసఫ్ పఠాన్‌లను జట్టులోకి తీసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, శ్రీలంకలతోపాటు భారత జట్టు ముక్కోణపు టోర్నిలో ఆడనుంది.
జట్టు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), సచిన్, గౌతమ్ గంభీర్,రోహిత్ శర్మ, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మనోజ్ తివారీ, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అశోక్ దిండా, అశ్విన్, రాహుల్ శర్మ, ప్రవీణ్ కుమార్, వినయ్ కుమార్.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more