దక్షిణాఫ్రికాలో 2009లో నిర్వహించిన రెండో విడత ఐపిఎల్ సందర్భంగా బిసిసిఐ విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంచిందని, దాదాపు రు.1.650 కోట్లమేర అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల దృష్ట్యా ఐపిఎల్‌కు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేమని ప్రభుత్వం పేర్కొనడంతో బిసిసిఐ అప్పటికప్పుడు ఐపిఎల్ వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. 37 రోజులు సాగిన ఈ టోర్నీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందకుండానే విదేశీ బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం ద్వారా 'ఫెమా' (1999) చట్టాన్ని ఉల్లంఘించిందని, రు.250 కోట్లకుపైగా దక్షిణాఫ్రికాలోని ఖాతాకు తరలిచిందని, అలాగే ఆ టోర్నీలో వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించడంలో కూడా విఫలమైందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. అప్పట్లో ఐపిఎల్ ఛీఫ్‌గా వున్న లలిత్ మోడీతోపాటు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more