టీమిండియా మాజీ గురు ప్రస్తుత దక్షిణాఫ్రికా కోచ్ గ్యారీ కిర్‌స్టీన్ జీతం చిదంబర రహస్యంగా మారింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చట్టపరమైన, పాలనాపరమైన కమిటీ దగ్గర దీనికి సంబంధించి ఎలాంటి ఆధారమూ లేక పోవడం ఆశ్చర్యకర విషయం. కిర్‌స్టీన్ జీతం గురించి తెలుసుకోవడాని ప్రయత్నిస్తే రహస్యం అని సమాధానం వచ్చిందని సిఎస్‌ఎ (క్రికెట్ సౌతాఫ్రికా) లీగల్, గవర్నెస్ కమిటీ ఛైర్మన్ అజరు శుక్లా తెలిపారు.
బోర్డు అనుమతి లేకుండా దాదాపు రెండు సంవత్సరాలు సిఎస్‌ఏ ఎగ్జిక్యూటీవ్ చీఫ్ గెరాల్డ్ మజోల్లాకు ఇతర సిఎస్‌ఏ అధికారులకు బోనస్‌లు చెల్లించారు. క్రీడా శాఖా మంత్రి ఫికిలె మబుల్లా దీనిపై అంతర్గత ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖతో విచారణ జరిపించారు. ఈ విచారణలో అజరు శుక్లా పై విధంగా సాక్ష్యం చెప్పాడు. సిఎస్‌ఏ నైతిక నాయకత్వంను కోల్పోయిందని, ఐసిఎల్ బోనస్ సమస్యపై విచారణ కమిటీని సిఎస్‌ఏ అధ్యక్షుడు మతుజెలి న్యాకా రెండు సార్లు తొలగించాడని, సిఎస్‌ఏ స్పాన్సర్‌షిప్‌కు ప్రయోజం కలిగించేందుకు అలా చేశారని శుక్లా తెలిపాడు. ' మాకు అధ్యక్షుడి , హై కోర్టు న్యాయమూర్తి, చీఫ్ జస్టీస్ జీతాల గురించి తెలుసు కాని జాతీయ క్రికెట్ కోచ్ జీతం గురించి మాత్రం తెలీదు. సుపరి పాలన (మూల సూత్రాలు)లో భాగంగా దాన్ని రహస్యంగా ఉంచారు' అని శుక్లా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more