Picture of nude woman per se not obscene sc

Barbara Feltus,Boris Becker,Supreme Court,Picture of nude woman,nudity

Supreme Court has ruled that a woman nude picture in a publication could not per se be termed obscene under IPC or Indecent Representation of Women (Prohibition) Act, 1986.

మహిళ నగ్న చిత్రాన్ని ప్రచురిస్తే తప్పులేదు

Posted: 02/08/2014 04:25 PM IST
Picture of nude woman per se not obscene sc

మహిళల నగ్న చిత్రాల ప్రచురణ విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒక మహిళ నగ్న చిత్రాన్ని ప్రచురణకు వినియోగిస్తే.. అది అసభ్యకరం కిందకు రాదని స్పష్టం చేసింది. 'మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని నిషేధించే 1986 చట్టం కింద కోర్టు ఈ తీర్పు చెప్పింది.

ఒక మహిళ నగ్న చిత్రం లేదా అర్థనగ్న చిత్రం.. లైంగిక ఉత్తేజం, కోర్కెలను కలుగజేస్తే తప్ప దానిని అసభ్యకరమని అనడానికి లేదు' అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన బెంచ్ పేర్కొంది. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ బోరిస్ బెకర్ నగ్న చిత్రాన్ని ప్రచురించిన రెండు ప్రచురణ సంస్థలపై విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

ఏదైనా కథనం లేదా పుస్తకం అసభ్యకరంగా ఉందని నిర్ధారించే విషయంలో కోర్టు కొందరు అబిప్రాయాలనుకాకుండా జాతి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని సూచించింది. అసభ్యకరమనేది చిత్ర భంగిమలపై ఆధారపడి ఉంటుందని, లైంగిక ఉత్తేజాన్ని కలిగించే వాటినే అశ్లీలంగా భావించాల్సి ఉంటుదని ధర్మాసనం పేర్కొంది. అసభ్యత అనేది సాధారణ పౌరుడు ఆలోచనల్లోంచి చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles