నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు మేరకు మీరు షుగర్ పేషంట్లు అయినా ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్హులే. ఈ మేరకు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. షుగర్‌తో బాధపడుతున్నవారు విధులు సక్రమంగా నిర్వహించలేరనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది.
తనకు షుగర్ వ్యాది వుందని తనను ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని దక్షిణ రైల్వేపై పోరాడిన పుష్పమ్ అనే మహిళను 8 వారాల్లోగా ఉద్యోగంలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆమె అపాయింట్మెంట్ను వ్యతిరేకిస్తూ రైల్వే సిపిఆర్వో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రామసుబ్రహ్మణ్యం, టి.మైత్రివన్లతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. అదే సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ డయాబెటిక్ రీసర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారత్‌లో 40.9 మిలియన్ల మంది మధుమేహవ్యాధి గ్రస్తులని చెబుతూ వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమంటే కుదరదని తేల్చి చెప్పింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more
Jun 24 | భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల... Read more
Jun 03 | నా భార్య నా అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లింది. మా ఏడేళ్ల దాంపత్య జీవితంలో ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాప వున్నా.. వారిని వారి తల్లిదండ్రుల వద్ద వుంచి.. వెళ్లిపోయింది. నాతో నిత్యం గోడవపడేది.... Read more