Parental-side kin can inherit property of Hindu widow: SC భర్త వారసత్వ అస్తిని నా తండ్రి కుటింబికులు ఇవ్వోచ్చా.?

Can a hindu widow give her inherit property to her parental kin

Supreme Court, property, parental side, Hindu Succession Act, heirs, Father, Justice Ashok Bhushan, Justice R Subhash Reddy, Badlu, agricultural land, Bali Ram, Sher Singh, Jagno, childless widow, family settlement, HIgh Court

The Supreme Court has said family members on the parental side of a Hindu widow can’t be held to be ‘strangers’ and her property can devolve upon them under the Hindu Succession Act. Referring to Section 15(1)(d) of the Act, a bench of Justices Ashok Bhushan and R Subhash Reddy said the heirs of the father of a Hindu woman are covered under persons entitled to succession of property.

భర్త వారసత్వ ఆస్తిని నా తండ్రి కుటింబికులు ఇవ్వోచ్చా.?

Posted: 03/16/2021 02:52 PM IST
Can a hindu widow give her inherit property to her parental kin

తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని.. కుటుంబం అనే పదాన్ని విస్తృత కోణంలో చూడాల్సిన అవసరముందని అత్యున్నత న్యాయస్థానం పేర్కోంది. తమకు పిల్లలు లేని కారణంగా.. తమకు సంక్రమించిన ఆస్తిని హిందూ వైద్యవం పోందిన మహిళ తన చరమాంకంలో తన తండ్రి తరపు బంధువులకు.. లేదా అమె రక్తసంబంధికులలో ఎవరికైనా అందించవచ్చునని న్యాయస్థానం అదేశాలు జారీచేసింది.

హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ ఇష్టానుసారం తమ కుటుంబ వారసులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. పిల్లలు లేని హిందూ మహిళలు.. తమ తదనంతరం తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను తమ భర్త తరపు కుటింబికులకే కాకుండా.. అమె తన తండ్రి తరపు వారసులకు కూడా అందించవచ్చునని తీర్పును వెలువరించింది. హిందూ కుటుంబం అనే పదాన్ని చిన్నగా చూడకూడదని ఈ సందర్భంగా సూచించింది.

హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులను పరాయి వ్యక్తులుగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కోంది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(1)(డి) ప్రకారం హిందూ మహిళకు తన భర్త తరపు వారితో పాటు తన తండ్రి తరపు వారు కూడా వారసులుగానే పరిగణించాల్సి వుంటుందని పలు కేసులను జోడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీంతో హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు కూడా తన ఆస్తిని పంచి ఇచ్చే అధికారం వుందని స్పష్టం చేసింది.

కుటుంబం అనే పదాన్ని విసృత్త భావంతో చూడాలని.. అంతేకాని దగ్గరి బంధువులను మాత్రమే కుటుంబంగా, చట్టబద్ద వారుసులుగా భావించడం సరికాదని పేర్కోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకభవించిన న్యాయస్థానం.. కక్షిదారులు వేసిన పిటీషన్ ను తోసిపుచ్చింది. హిందూ మహిళకు సంబంధించిన వీలునామా లేని వారసత్వ అస్తులు సెక్షన్ 16 ప్రకారం పరిగణించబడతాయని సెక్షన్ 15 చెబుతోందని న్యాయస్థానం పేర్కోంది. దీని ప్రకారం.. మొదట, అమె కుమారులు మరియు కుమార్తెలపై (లేదా మనువలు, మనువరాళ్లు) మరియు భర్తకు.. లేదా భర్త వారసులకు, లేదా తల్లిదండ్రులకు, లేదా తల్లిదండ్రుల వారసులకు ఇక చివరగా తల్లి తరపు వారసులకు కూడా ఇచ్చే అధికారం ఉందని న్యాయస్థానం పేర్కోంది.  

సంతానం లేని వితంతువు తన సోదరుల కొడుకుకు అనుకూలంగా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని అప్పగించడాన్ని అనుమతించిన హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సందర్భంలో, జగ్నో అనే మహిళకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. భర్త షేర్ సింగ్ మరణానంతరం తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని తన సోదరుడి కుమారులకు పంచి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ షేర్ షింగ్ కుమారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం వారి పిటీషన్ ను తోసిపుచ్చింది. ఆస్తిపై జగ్నోకు పూర్తి హక్కులు వున్నాయని తెలిపింది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles