Daughter get a share of her father

property law, father property, wife and husband

Daughter get a share of her father.

కూతురికి తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా ?

Posted: 01/27/2014 04:21 PM IST
Daughter get a share of her father

మా మామగారు, ఊళ్లో మా మామగారి పేరిటతన స్వార్జితమైన 14 ఎకరాల వ్యవసాయ భూమి, మా అత్తగారి పేరిట (50-బి ప్రకారం) 8 ఎకరాలు ఉంది. అలాగే హైదరాబాద్‌లో తన ఇద్దరు కొడుకుల పేరిట 450 గజాల ప్లాటు కూడా కొన్నాడు. మా అత్తగారి పేరిట ఉన్న భూమిని 1990 లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అలాగే మా అత్తగారు బతికుండగానే మా మామగారు, తన పేరిట ఉన్న భూమిని 2007లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అయితే 2009లో రెండవ కుమారుడు తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నా డు. మా అత్తయ్య 2009లో రిజిస్టర్ అయిన కొద్దిరోజులకే చనిపోయింది. మా అత్త పేరిట ఉన్న 10 ఎ కరాల భూమిని 2009లో చిన్న కొడుకు ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించుకున్నాడు. మా మామగారి స్వార్జితమైన మొత్తం భూమిలో, హైదరాబాద్‌లోని ప్లాటులో నా భార్యకు వాటా ఉంటుందా? లేదా ? నా సమస్యకు సరియైన పరిష్కారం తెలియచేయండి.

మీ మామగారి స్వార్జితమైన స్థిరాస్తులు, అవి వ్యవసాయ భూములైనా లేదా హైదరాబాద్‌లోని ప్లాట్ అయినా, ఆయన వీలునామా రాయకుండా చనిపోయిన ట్లయితే, ప్రస్తుతం సవరించి సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా, తండ్రిగారి ఆస్తిలో కూతుళ్లకు కూడా, సమాన హక్కు లభిస్తుంది. మీ భార్యకు ఒక కూతురుగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన వాటాను ఇవ్వకుండా కేవలం, కుమారులే వారికి వారుగా బదిలీ చేయించుకుని ఆర్ఓఆర్‌లో ఎంట్రీ చేసుకున్నంత మాత్రాన వారికి యాజమాన్యపు హక్కులు సంక్రమించవు. అందువల్ల మీ బావ మర్దులు ఆర్ఓఆర్ ద్వారా బదిలీ చేయించుకున్న విషయాన్ని ప్రశ్నిస్తూ, ఈ ఆస్తులు ఏ న్యాయస్థానం పరిధిలో ఉన్నాయో, ఆ న్యాయస్థానంలో పార్టీషన్‌కై మీ భార్య ద్వారా దావా వేసినట్లయితే, మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది 50-బి పర్మిషన్ ఉన్నప్పటికి ఆమె వీలునామా రాయకుండానే చనిపోయి ఉంటే, మీ భార్యకు ఆమె అన్నదమ్ములతో సమాన వాటా లభిస్తుంది. మీరు వ్యవసాయ భూమి, ప్లాట్, వీటిలో ఏదో ఒకటి ఏ కోర్టు పరిధిలో ఉన్నాయో తెలుసుకుని, మిగతా ఆస్తులు ఆ కోర్టు పరిధిలో లేకపోయినా, మీరు పార్టీషన్‌కై దావా వేయవచ్చు. మీరు ఏదో ఒక ఆస్తి ఉన్న మీకు సౌకర్యంగా ఉన్న న్యాయస్థానాన్ని ఎంచుకుని, దావా వేయండి. అలా మీ భార్య తన వాటాను పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles