The guiding principles

The guiding principles

The guiding principles

లైంగిక వేధింపుల మార్గదర్శక సూత్రాలు

Posted: 11/25/2013 08:10 PM IST
The guiding principles

దేశంలో రోజు రోజుకు లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కడో ఒకదగ్గర బాలికలు, మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించే ఉద్దేశంతో రూపొందించిన ఈ మార్గదర్శక సూత్రాల్లో ఏముందో తెలుసుకుందాం..

లైంగిక వేధింపులంటే ఏమిటి ?

1) శరీరాన్ని ముట్టుకోవడం, ముట్టుకోవటానికి ప్రయత్నించటం

2) లైంగికపరంగా తృప్తి పరచాలని కోరటం లేదా డిమాండ్ చేయటం

3) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం

4) అశ్లీలమైన చిత్రాలు, వీడియోలు (పోర్నోగ్రఫీ) చూపించడం.

5) లైంగిక భావాలను మాటలు లేదా చేతలు లేదా సంజ్ఞల ద్వారా వ్యక్తీకరించటం.

సంస్థలు ఏం చేయాలి?

ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని సంస్థలు లైంగిక వేధింపులను అరికట్టడానికి ఈ కింది చర్యలు తీసుకోవాలి.

ఎ) లైంగిక వేధింపులంటే ఏమిటనే విషయాలను పనిచేసే వారందరికి తెలియపరచాలి.

బి) ఒక వేళ ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకొనే విధంగా నిబంధనలను రూపొందించాలి.

సి) ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) యాక్ట్, 1946లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉండేలా తగిన మార్పులు చేయాలి.

డి) పని ప్రదేశంలో మహిళలకు సరైన వాతావరణం ఉండాలి. పనివేళలు, విరామ సమయం, ఆరోగ్యం, శుభ్రత వంటి అంశాలలో మహిళల పట్ల వివక్ష చూపించకూడదు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాల సౌకర్యవంతంగా

ఉండాలి.

క్రిమినల్ చర్యలు

ఎవరైనా ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడితే భారతీయ శిక్షాస్మృతిలో అధికరణల కింద అతనిపై యజమాని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతే కాకుండా ఫిర్యాదు చేయటం వల్ల వివక్షకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా యజమానిపైనే ఉంటుంది. లైంగిక వేధింపులకు గురయిన వారు తమను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయమని అడిగే హక్కు కూడా కల్పించాలి.

క్రమశిక్షణ చర్యలు

సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే యజమాని క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలి

ఫిర్యాదు ప్రక్రియ

ఒక మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే .. దానిని పరిష్కరించటానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యజమానిపై ఉంది. ఈ వ్యవస్థ నిర్ణీత కాలపరిమితిలో సిబ్బంది చేసిన ఫిర్యాదులను పరిష్కరించాలి.

ఫిర్యాదుల కమిటీ

జూ ఈ కమిటీలో సగానికిపైగా మహిళలు ఉండాలి. దీనికి ఒక మహిళ నేతృత్వం వహించాలి. ఉన్నత స్థాయిలో ఒత్తిడి లేకుండా చూడటానికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కాని ఈ అంశాలపై పనిచేస్తున్న కార్యకర్తను కాని కమిటీలో

సభ్యురాలిగా నియమించాలి.జూ తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాము తీసుకున్న చర్యలపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించాలి.

సిబ్బంది వైపు నుంచి..

సిబ్బంది జరుపుకొనే మీటింగ్‌లలో లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలను లేవనెత్తనివ్వాలి.

లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలి. నిబంధనలన్నింటినీ సిబ్బందికి తెలియజేయాలి.

ఇతరుల నుంచి..

ఇతరుల చేతిలో తమ సిబ్బంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వెంటనే యజమాని చర్యలు తీసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles