Maintenance for second wife if man lied about first wedding

Supreme Court, wife,marriage,Maintenance, wedding, legal,marriage

Marrying second time by hiding existence of first wedlock is illegal but the second wife is to be treated as the "legally wedded wife for the purpose of getting maintenance from her husband under Hindu Marriage Act, the Supreme Court has ruled.

రెండో భార్యకు భరణం ఇవ్వాల్సిందే

Posted: 10/21/2013 10:14 AM IST
Maintenance for second wife if man lied about first wedding

హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చట్టవిరుద్ధమైనప్పటికీ రెండవ భార్య భరణానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ సిక్రీలతో కూడిన ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ ఈ తీర్పునిచ్చింది. రెండవ భార్యకు భరణం ఇవ్వాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే మొదటి వివాహాన్ని దాచి రెండవసారి పెళ్లి చేసుకుంటే రెండవ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రెండవ భార్య భరణానికి అర్హురాలు కాదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూలింగ్‌కు సవరణ చేయకపోతే భర్తలు ఇలా రెండవ పెళ్లి చేసుకొని రెండవ భార్యలను గాలికి వదిలేస్తారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మొదటి వివాహాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి రెండవ పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని, ఆమె భరణం పొందడానికి అర్హురాలేనని ధర్మాసనం తెలిపింది. మొదటి వివాహం జరిగి భార్య జీవించి ఉన్నట్టు తమకు తెలిసీ పెళ్లి చేసుకునే మహిళలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles