Hindu marriage act

hindu marriage act, 1955, acts, bare acts, sections, schedules, short title, enactment date, footnotes, rules, law, legal

hindu marriage act, 1955, acts, bare acts, sections, schedules, short title, enactment date, footnotes, rules, law, legal

హిందూ వివాహ చట్టం షరతులు

Posted: 05/06/2013 05:51 PM IST
Hindu marriage act

హిందూ వివాహాలకు షరతులు ఉన్నాయని తెలుసు. అవి ఎలాంటివి, హిందూ వివాహాలకి సంరక్షకుల అనుమతి అవసరమా? అదే విధంగా ఇలాంటి వివాహ షరతులు ఉల్లంఘిస్తే నేరమా? పూర్తి సమాచారం తెలియజేయగలరు.

చట్టంలోని సెక్షన్‌ 5, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వధూవరులిద్దరూ సంతృప్తిచెందితేనే ఇద్దరు హిందూవుల మధ్య వివాహం జరిపించాల్సి ఉంటుంది. పెళ్ళి చేసుకునే వధూవరులలో ఎవరికైనా అంతకు పూర్వం ఒకసారి పెళ్ళి అయి ఉంటే ఆ భర్తగానీ, భార్యగానీ జీవించి ఉండకూడదు లేదా చట్ట ప్రకారం విడాకులు తీసుకొని ఉండాలి. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అదే విధంగా వివాహం... ఏ మతానికి సంబంధిస్తే... ఆ మత వివాహ పద్ధతి ప్రకారం చేసుకోవడం ఆనవాయితీ. కానీ అదే వివాహ బంధాన్ని విడగొట్టాలంటే ఆ అధికారం కేవలం ఒక్క న్యాయస్థానాలకు మాత్రమే ఉంది. అందుకోసమే రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారెవరైనా... అంతకుముందు జరిగిన పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాన్ని తప్పనిసరిగా న్యాయస్థానం ద్వారా పొంది ఉండాలి. అలా లేని పక్షంలో చేసుకున్న రెండో పెళ్లి చట్టప్రకారం చెల్లుబాటు కాదు. అది చట్ట విరుద్ధం కూడా.

వివాహ సమయంలో వధూవరులిద్దరు మతిస్థిమితం కోల్పోయిన కారణంగా వివాహానికి అమోదం తెలుపలేని పరిస్థితులలో ఉండరాదు. ఒకవేళ వివాహనికి తమ అమోదం తెలిపే పరిస్థితి ఉన్నప్పటికీ సంతానానికి ఇబ్బందులు కల్గించేటటువంటి మానసిక ఆనారోగ్యం ఉండకూడదు. అదే విధంగా వారిరువురికి తరచూ ఉన్మాదంగానీ, మూర్చలుగాని వచ్చి బాధపడుతూ ఉండరాదు అదేవిధంగా వివాహ సమయంలో వధువుకి (అమ్మాయికి) పద్దెనిమిది సంవత్సరాలు, వరునికి (అబ్బాయికి) ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి వుండాలి. ఆచార వ్యవహరాలు అనుమతించినప్పుడు తప్ప భార్యభర్తల మధ్య నిషేధించబడిన బంధుత్వం ఉండరాదు. చట్టప్రకారం నిషేధించిన బంధుత్వాలు ఇలా వున్నాయి...

    1. తన పూర్వీకులైన స్ర్తీలు.
    2. తన వంశానికి చెందినవారు.
    3. సోదరుల భార్యలు.
    4. తండ్రి సోదరుని భార్య.
    5. తల్లి సోదరుని భార్య.
    6. తాత సోదరుని భార్య.
    7. నానమ్మ సోదరుని భార్య.
    8. సోదరి.
    9. సోదరుని కూతురు.
    10. అక్క కూతురు.
    11. మేనత్త, తల్లి సోదరి.
    12. మేనత్త కూతురు.
    13. తండ్రి సోదరుని కూతురు.
    14. తల్లి సోదరి కూతురు, సోదరుని కూతురు.

    హిందుమతానికి చెందిన స్ర్తీ ఈ క్రింది బంధుత్వాలున్న పురుషులని వివాహం చేసుకోవడాన్ని చట్టం నిషేధించింది.   

    1. తన వంశపారంపర్య పూర్వీకులు (తండ్రి, తాత మొదలగువారు).
    2. తన వంశపారంపర్య పూర్వీకుల భర్తలు.
    3. తన సంతతి వారి భార్తలు (అల్లుడు, కొడుకు, కూతరు భర్త మొదలగువారు).
    4. సోదరుడు, తండ్రి సోదరుడు, తల్లి సోదరుడు.
    5. సోదరుని కొడుకు, సోదరి కొడుకు.
    6. తండ్రి సోదరి కొడుకు, తల్లి సోదరి కొడుకు.

ఈ నిషేధం అన్ని రకాలైన రక్తబంధాలకి వర్తిస్తుందా! అనే సమస్యకు ఈ నిషేధం అన్ని రకాలైన రక్త సంబంధాలు గల బంధుత్వానికి వర్తిస్తుంది. సంపూర్ణ రక్త సంబంధం, ఆసంపూర్ణ రక్త సంబంధంగల వ్యక్తులందరికీ, ఆ బంధుత్వాలు చట్ట బద్దమైన సంబంధం వల్ల కలిగిన సంతానమైనప్పటికీ, కానప్పటికీ, ఆ బంధుత్వం దత్తత స్వీకారం వల్ల ఏర్పడినప్పటికీ లేక సంపూర్ణ రక్త సంబంధం వల్ల ఏర్పడినప్పటికీఈ నిషేధం వర్తిస్తుంది.

అదే విధంగా సెక్షన్‌ 18 ప్రకారం, సెక్షన్‌ 5 లో పేర్కొన్న షరతులలో 3, 4, 5 ఉల్లంఘన పై వివిధ చట్టాల ప్రకారం నేరాలవుతాయి. భార్యగాని, భర్తగాని బ్రతికివుండగా రెండో వివాహం చేసుకొంటే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 494 ప్రకారం నేరమవుతుంది. అలాగే బాల్య వివాహాలు బాల్యవివాహాల నిరోధక చట్ట ప్రకారం నేరాలవుతాయి.

వివాహ సమయంలో వధువుకి 18 సంత్సరాలు నిండినప్ప డు వరునికి 21 సంవత్సరాలు నిండినప్పుడు ఆచార వ్యవహరాలు అనుమతించినప్పుడు, నిషేధించబడిన బంధు త్వాల మధ్య వివాహం చేసుకున్న, నిషేధించబడిన సపిండు ల మధ్య వివాహం చేసుకొన్నా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌18 ప్రకారం నేరాలుగా పరిగణించబడుతాయి.

ఆ విధంగా వధువునకు 18 సంవత్సరాలు నిండకపోయినా లేక వరునికి 21 సంవత్సరాలు నిండకపోయినా నేరం వివాహం చేసుకుంటే నేరం అవుతుంది. అలా చేసుకున్నవారికి చట్ట ప్రకారం 15 రోజుల వరకు సాదారణ జైలు శిక్షగాని, వెయ్యి రూపాయల వరకు జరిమాన గానీ లేక రెండింటినీ గాని న్యాయస్థానం విధించవచ్చును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles