Gruha himsa case

గృహహింస చట్టం

Posted: 05/17/2013 07:46 PM IST
Gruha himsa case

నాకు 2005వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అప్పటి నుండి మా సంసారం సక్రమంగానే జరుగుచున్నది, దాదాపు రెండు సంవత్సరాల క్రితం మా అమ్మ, నాయన బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ తరువాత దాదాపు ఆరు నెలలు క్రిందట నేను కూలీపని చేయడానికి మా అమ్మ, నాయన దగ్గరకు వెళ్ళి, అక్కడ నుండి, ప్రతి నెలా నా భార్యకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పంపుచున్నాను, నేను కూడా నెలకోసారి నా భార్య దగ్గరికి వెళ్లేవాడిని. కాని ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఒక చిన్న కాంట్రాక్ట్‌ పని తీసుకొని, బిజీగా అయి... రెండు నెలల నుండి వెళ్ళలేదు, కాని డబ్బు మాత్రం పంపుచున్నాను. ఈమధ్యకాలంలో నా భార్య జనం మాటలు విని నాపై, నా తల్లిదండ్రులపై గృహహింస చట్టం క్రింద కేసు పెట్టింది. అదేవిధంగా వరకట్న వేధింపుల కేసుపెట్టింది. ఇది ఎంతవరకు న్యాయం, దీనికి నేను ఏమి చేయవలెను, న్యాయ సలహ ఇవ్వగలరు.


మీరు నిజంగా మీ భార్యను ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా ఆమెకు జీవనోపాధి చూడకుండా ఉన్నచో తప్పక ఈ కేసులు మీకు గాని, మీ అమ్మా, నాయనకు కూడా కొంతవరకు వర్తించును. అలా కాకుండ నిజంగా ప్రతి నెల మీ భార్యకు డబ్బులు పంపినట్లు ఋజువులు ఉండి మీరు చెప్పినట్లు మీ అమ్మ, నాయన మరియు మీరు కూడా రెండు నెలల నుండి దూరం ఉన్నచో వాటిని సాక్ష్యుల ద్వారా న్యాయస్థానాకి ఋజువు చేయగలిగినప్పుడు మీ భార్య, మీ యొక్క అమ్మ, నాయన మరియు మీ పై పెట్టిన కేసు ఏమి చెల్లనేరవు, అని చాలా ఉత్తర్వులు గలవు. దానికి బాంబే హైకోర్టు ఈ మధ్య కాలంలో కూడా ఒక తీర్పు ఇచ్చింది. అది సంసార సంబంధం కలిగి ఉంటేనే గృహహింస చట్టం క్రింద నిర్దిష్ట సహయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చును, అలా కానిచో ఆ కేసులు తిరస్కరించబడును అని జస్టిస్‌ రోషన్‌ దల్వి స్పష్టం చేశారు. కావున మీరు న్యాయస్థానానికి రెండు నెలల నుండి సంసార సంబంధాలకు దూరంగా ఉన్నట్లు ఋజువు చేసినచో తప్పక న్యాయం జరుగును.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles