Power of attorney act

power of attorney, power of attorney india, contract, law firm India, lawyer India, property, law, contracts, legal services, agreement, transaction, registration, legal matters, property, divorce, wills, mortgage, tax, agreements, attested, lease, sell, fraud, rent, deeds, notary, attorney legal, real estate, moveable property

Legal Services provides help on property matters like power of attorney, land dispute, evaluation and verification of Property, Buying, Selling and rent of Real Estate in India. We solicit queries concerning legal matters throughout india

Power of Attorney Act.GIF

Posted: 03/16/2012 01:51 PM IST
Power of attorney act

Power_of_Attorney_Act1

Power_of_Attorney_Act2పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏమిటి ? దాని విధివిధానాలు, దానిని తప్పక రిజిష్టర్ చేయాలా ? చేసేత లాభం ఏమిటి ? ఒకవేళ రిజిష్టర్ చేయకుంటే నష్టమా ? అసలు పవర్ ఆఫ్ అటార్నీ హక్కులు ఏమిటి ?

ఏ వ్యక్తి అయినా ఒక్కొక్కప్పుడు తన ఆస్తి నిర్వహణ వ్యవహారాల్లో... ఆస్తిని అమ్మటం కొనటం లేదా ఆస్తి వ్యవహారాలు చూడటం వీలుకానప్పుడు ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి వయసు మళ్ళినప్పుడు గానీ, ఆస్తులు ఎక్కువగా వున్నప్పుడు గానీ, సదరు ఆస్తులు చూసుకొనుటకు వీలుకానప్పుడు ఈ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆస్తి పై హక్కును మరో వ్యక్తికి బదిలీ చేయవచ్చు. ఒక వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలంటే ఆ వ్యక్తి మేజర్ అయి ఉండి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉండటం చాలా ముఖ్యం. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకునే వ్యక్తి.... ఇచ్చిన వ్యక్తి ఆస్తి ఉదాహారణకు భూమి అనుకుంటే... ఆ భూమి హద్దులను, సర్వే నెంబర్లను లేక ఇంటి నెంబర్లను అతిక్ర మించకూడదు. అలా చేసినచో వెంటనే ఆ పవర్ ఆఫ్ అటార్నీ రద్ద చేసే అధికారం ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. అలా అని అధికారం ఉంది కదా అని తన ఇష్టం వచ్చినట్లు రద్దు చేసే అధికారం కూడా లేదు. చట్ట ప్రకారం దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న వ్యక్తి దానిలో గల కండీషనల్ అగ్రిమెంట్ ను అతిక్రమించనప్పుడు అతను చేసిన తప్పులను అనగా దుర్వినియోగములను చూపుతూ... దానికి కారణాలు అడిగినప్పుడు.... అటార్నీ తీసుకున్న వ్యక్తి సమాధానం సరిగా లేనట్లయితే... పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి ఒక దిన పత్రిక ద్వారా తాను ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసుకునే అధికారం గలదు.

పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న వ్యక్తి అనగా.... ఏజెంట్ లేదా మూడవ వ్యక్తి అనగా... ఏదేని వ్యవహారాలు జరుపుటకు నియమితులైన వ్యక్తి అని అర్థం. పవర్ ఆఫ్ ఏజెన్సీ కాంట్రాక్టులో ప్రవేశించుతూ.... చేయబడిన కాంట్రాక్టు యొక్క రూపమేగానీ మీరేమీ కాదు. ఈ ఏజెన్సీ కాంట్రాక్టు అక్షర బద్దమైనప్పుడు ఆ పత్రాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. పవర్ ఆఫ్ అటార్నీల చట్టం 1882లో పవర్ ఆఫ్ అటార్నీ అనే మాటలో దానిని వ్రాసి ఇచ్చే వ్యక్తి పేరు మీద, అతని తరుపున వ్యవహరించుటకు గాను ఒకానొక నిర్థిష్ట వ్యక్తికి అధికార మిచ్చునట్టి ఏ పత్రము గానీ చేరుతుంది. అందుచేత పవర్ ఆఫ్ అటార్నీ ఇదే విషయం కాంట్రాక్టు చట్టం 1872లోని ఏజెన్సీకి సంబంధించిన పదవ అధ్యాయమునకు పవర్స్, అటార్నీలనే విషయములు కాంట్రాక్టు చట్టం 1882 నకు వర్తింప బడుతున్నది.

పవర్ ఆఫ్ అటార్నీ రెండు రకాలు.... మొదటిది ప్రతేక్యక నిర్థిష్ట పవర్ ఆఫ్ అటార్నీ, రెండోది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీ ఒకే వ్యవహారములను సంబంధించి మాత్రమే అనగా ఒక భూ భాగము లేదా ఇంటిని అమ్ముట మొదలగు వాటికి ఇవ్వబడుతుంది. దానినే అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఆ వ్యవహారము పూర్తిగానే ఈ ప్రత్యేక పవర్ ఆఫ్ సెల్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీని వహించే వ్యక్తి ఆధారితము అంతరించిపోతుంది. అనగా అగ్రిమెంట్ ఆఫ్ నేషనల్ సేల్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ వ్యక్తి ఆస్తిని అమ్మిన వెంటనే దానిపై అధికారము కొల్పోవును అని చెప్పవచ్చు. అదే విధంగా జనరల్ పరవ్ ఆఫ్ అటార్నీ అయిన దానిని వహించిన వ్యక్తికి ప్రధాన వ్యక్తి తరుపున ఏమి చేయుటకైననూ చాలా అధికారము ఇవ్వబడినది. వ్రాత పూర్వకమైన పవర్ ఆఫ్ అటార్నీ ప్రత్యేక పవర్ ఆఫ్ అటార్నీయా లేక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీయా అనేది ప్రధాన వ్యక్తి యొక్క ఉద్దేశ్యముపై ఆధారపడి చేయవలసి ఉంటుంది. ఆ ఉద్దేశ్యము ఈ పత్రములలో ఉపయోగించిన మాటలను బట్టి అన్వయించు కోవాలి. దాని పై పెట్టన స్టాంపు డ్యూటి విలువను బట్టి అధికార స్వభావమును నిర్ణయించుటకు వీలు కాదు.

పవర్ ఆఫ్ అటార్నీ చట్టంలోని సెక్షన్ -2 కింద పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి తాను యుక్తమని తలచిన ఏ పత్రమును గానీ లేదా పనిని గానీPower_of_Attorney_Act3 పేరుతోనూ సంతకంతోనూ చేయవచ్చును. అట్టి పని లేదా పత్రము పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి స్వయముగా తన అధికారముతో పేరుతో తన సంతకంతో సీలుతో అదే పని చేసినట్లు లేదా పత్రము వ్రాసి ఇచ్చినట్లుగా ప్రభావం కలిగి ఉంటుంది. ఒక కేసులో ఒక వ్యక్తి తాను ఇండియాలో ఉండని కాలములో తన తరుపున వ్యవహరించుటకు గాను మరియొక వ్యక్తి పేర పవర్ ఆఫ్ అటార్నీ వ్రాసి ఇచ్చినాడు. అయినప్పటికీ అది రిజిష్టర్ కాని కారణమున కలకత్తా హై కోర్టు దాని యధార్థతను పురోభాఠన చేయవలసిన అవసరం లేదని అభిప్రాయ పడింది. ఎ.ఆర్. 1916 కలకత్తా 979 పవర్ ఆఫ్ అటార్నీ రిజిష్టర్ కాకపోయినప్పటికీ చెల్లుబాటు అవుతుంది. కాని దాని యథార్థను సాధారణ సరళిలో కోర్టు అంగీకరించవలసిన పని లేదు. దాని యధార్థతను ప్రశ్నించినట్లయితే... దానిని నేరుగా రుజువు చేయవలసి ఉంటుంది. పైగా, పవర్ ఆఫ్ అటార్నీ దస్తవేజు రిజిష్టరయినచో అది నిజమైనదేనన్న భావన కలుగుతుంది. కనుక పవర్ ఆఫ్ అటార్నీని రిజిష్టర్ చేయుట అభాలషణీయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Property law
Child labour act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles