Property law

property law.gif

Posted: 03/29/2012 12:00 AM IST
Property law

Property-lawమేం ఇద్దరం అన్నదమ్ములం. మా అమ్మా మా చిన్నతనంలో చనిపోయింది. అప్పటి నుండి మా నాన్న చదివించి పెద్దవాళ్ళను చేసి మా అన్నయ్యలకు ఉద్యోగం ఇప్పించి అతడి పెండ్లి చేశాడు. ఇప్పుడు అతడు సంపాదన పరుడు కూడా. నేను ఈ సంవత్సరంలోనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరిన వెంటనే నా నాన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మా నాన్న సంపాదించిన ఆస్తి 9 లక్షల వరకు ఉంది. నా చదవుకోసం మా అన్న లక్షా యాభైవేల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్కలున్నాయి. అయితే మా నాన్న చనిపోయిన తరువాత 9 లక్షల ఆస్తిలో నా వాటా రావలసిన 4.5 లక్షలు రావలసి ఉంది. కొంత మంది పెద్దల పంచాయితీలో... నీ చదువు అయిన డబ్బు రూపాయలు 1,50,000 మినహాయించి వాటాలు వేయాల్సివుందంటున్నారు. ఇది న్యాయసమ్మతమేనా ? వారసత్వ చట్ట ప్రకారం నాకు ఎలాంటి వాటా వచ్చును. దీని న్యాయ పరమైన సలహా ఇవ్వగలరు ?

మీ అన్నను, మీ నాన్నగారు చదివించి, పెళ్ళి చేసి ఒక ఇంటి వానిగా, సంపాదన పరుడుగా చేసినాడు. ఆయన బ్రతికి ఉంటే... మిమ్మల్ని కూడా చదివించి పెళ్ళి చేసి ఒక ఇంటి వానిగా, సంపాదనపరుడుగా చేసేవాడు. కానీ మీ దురద్రుష్టంతో మీ నాన్నగారు చనిపోవటంతో మీరు సంపాదన పరుడుగా కాలేదు. అలా అని మీ నాన్న మిగిలించిన ఆస్తి మొత్తం మీకు తీసుకునే అధికారం, హక్కు లేదు. అదే విధంగా మీ చదువుకైన ఖర్చులను ఆస్తి మొత్తం నుండి తీసివేసి మిగతా సొమ్మును మీ ఇద్దరు అన్నదమ్ములకు సమానంగా పంచుకోవాలి.  అంతేగాని వాటాలేసిన తరువాత మీ వాటా నుండి మీ చదువుకైన ఖర్చులను వినహాయించడానికి వీలు లేదు. ఇది చట్టం చెబుతున్న వాస్తవం. వార సత్వ చట్టం లోని సెక్షన్ 49 చిన్న పిల్లల అభివ్రుద్ధికి ఖర్చు పెట్టిన మొత్తాన్ని వారి వాటాల పంపకంలో పరిగణలోకి తీసుకోరాదు. ఇంటెస్టెట్ గా చనిపోయిన ఒక వ్యక్తి యొక్క ఆస్తిలో కొంత భాగం ఒక పిల్లవానికి గానీ, అతని వారసునికి గానీ సంక్రమించి ఉంచవచ్చు. ఆ పిల్లవాడి అభివ్రుద్ధికి కొంత భాగం ఇంటెస్టెట్ గా చనిపోయిన వ్యక్తి తన జీవిత కాలంలో ఖర్చుపెట్టి ఉండవచ్చును. కావున మీకు పెట్టిన ఖర్చులను లెక్కలోకి తీసుకోకుండా ... ఉన్నదానిలో సమానంగా ఆస్తి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Not cookingcannot be grounds for divorce bombay court
Power of attorney act  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles