Government banks shock to seemandhra employees over loans

Government Banks Shock to Seemandhra Employees over Loans, Government Banks, ap bifurcation, samaikyandhra movement, Seemandhra Employees

Government Banks Shock to Seemandhra Employees over Loans

సీమాంధ్ర ఉద్యోగులకు షాకిచ్చిన బ్యాంకులు

Posted: 10/21/2013 08:25 PM IST
Government banks shock to seemandhra employees over loans

రాష్ట్ర విభజన ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ చేసిన నాటి నుండి సీమాంద్ర ఉద్యోగులు సమైక్యాంద్ర కోసం సమ్మెలో పాల్గొన్నారు. రెండు నెలల పాటు సమైక్యాంద్ర సమ్మెలో పాల్గొన్న సీమాంద్ర ఉద్యోగులకు .. ప్రభుత్వం జీతాలు కట్ చేసింది. అయితే సీమాంద్ర ఉద్యోగులను ఆదుకోవటానికి కొన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. కానీ సీమాంధ్రలోని ఉద్యోగులకు ప్రభుత్వ బ్యాంకులు బుణ కటింగులతో ఝలక్‌ ఇచ్చాయి. ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకున్నాయి. సీమాంధ్రలో సమ్మె కాలంలో జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు ఆదుకుంటామని ముందుకొచ్చిన బ్యాంకులు, ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. ఇచ్చిన హామీ మేరకు అప్పులు ఇస్తున్నా కటింగుల పేరుతో లాగేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగులకు అకౌంట్లో డబ్బులు పడ్డాయన్న ఆనందం లేకుండా పోయింది .సమ్మె కారణంగా జీతం కోల్పొయిన ఉద్యోగులకు యాభై వేల వరకు రుణం ఇస్తామంటూ బ్యాంకులు ఊదరగొట్టాయి.

 

దీంతో ఉద్యోగులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. పత్రాలు ఇచ్చి అప్పు కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. ఇంతలో రుణం మంజూరు అయ్యిందంటూ బ్యాంకు నుంచి ఓ మెసేజ్‌ రానే వచ్చింది. ఆశగా ఏటీఎంకు పరుగులు తీసిన ఉద్యోగులకు అసలు విషయం తెలిసింది. ఇచ్చిన యాభై వేల రూపాయల్లో ముప్పై వేల రూపాయలకు రెక్కలొచ్చేశాయి. రెండు నెలల వాయిదాలు, అడ్వాన్సులు అంటూ ముప్పై వేల రూపాయలు మినహాయించుకున్నారు బ్యాంకు అధికారులు.

 

దీంతో వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. సమ్మెకాలంలో వచ్చిందే మనదనుకుంటున్నారు. మొత్తానికి రుణం వచ్చిందనే ఆనందం ఉద్యోగులకు లేకుండానే పోయింది. చేసేదేమీ లేక దక్కిన డబ్బులతోనే ఉద్యోగులు సర్దుకుపోతున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more