Firing in hyderabad old city

Firing in Hyderabad Old City, Seemandhra bandh for 72 hours, Seemandhra calls for 72 hours Bandh

Firing in Hyderabad Old City, Seemandhra calls for 72 hours Bandh

పాతబస్తీలో కాల్పులు- ఈ అర్థరాత్రి నుంచి సమ్మె

Posted: 09/11/2013 08:18 PM IST
Firing in hyderabad old city

పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కరీంముల్లాఖాన్‌ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు జరిగాయి. సమీప బంధువులే అతనిపై కాల్పులు జరిపారు. తనపై ఇర్ఫాన్‌, అహ్మద్‌లు కాల్పులు జరిపారని కరీంముల్లాఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్పులకు కారణం కుటుంబకలహాలేనని పోలీసులు చెబుతున్నారు.

 

అర్థరాత్రి సమ్మె

సీమాంధ్ర విద్యుత్ సిబ్బంది బుధవారం అర్థరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చారు. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని ముఖ్యమంత్రి నచ్చజెప్పడంతో వారు నిరవధిక సమ్మెను 72 గంటలకు కుదించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాలని కోరుతూ తామూ ఈ సమ్మె చేయనున్నట్టు వారు చెప్పారు. అత్యవసర సేవలను మాత్రం సమ్మె నుంచి మినహాయిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోతే జరిగే నష్టం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానివల్ల విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతాయని వారు వివరించారు. ఈ సమ్మె వల్ల జరిగే నష్టాల గురించి తమకు తెలుసునని, అయినా రాష్ట్ర సమైక్యతను ఆకాంక్షిస్తూ సమ్మెకు దిగుతున్నామని వారు వివరించారు. రాష్ట్రాన్ని విభజించవద్దు అని కోరుతూ సమ్మెకు వెళ్తున్నట్టు ఎప్పుడో నోటీసు ఇచ్చామని, కాని ఇంతవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. అయినా అత్యవసర సేవలను ఈ సమ్మెనుంచి మినహాయిస్తున్నట్టు వారు వెల్లడించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more