హోం మంత్రి సబిత విధులకు దూరంగా ఉండటంతో కీలక దస్త్రాలు ఆమోదానికి నోచుకోలేక పోతున్నాయి. ఈ దస్త్రాలలో పోలీసు అధికారుల పదోన్నతులతో పాటు ఈ శాఖకు చెందిన అతి ముఖ్యమైన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ శాఖకు వస్తున్న దస్త్రాలన్నింటినీ సబిత కార్యాలయానికి చెందిన అధికారులు తీసుకుని బీరువాలలో దాచి పెడుతున్నట్లు సమాచారం. ఒకటి రెండు సందర్భాలలో కొన్ని ముఖ్యమైన దస్త్రాలను ఆ అధికారులు ఆమె నివాసానికి తీసుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేసినా అందుకు ఆమె నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాల పర్యటనలో ఉండటంతో ఈ దస్త్రాలపై పెద్దగా దృష్టి సారించలేదని చెబుతున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు డీఎస్పీగా పదోన్నతి పొందాల్సి ఉంది. ఈ దస్త్రం హోం మంత్రి ఆమోదం పొందాక ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శాఖ పదోన్నతుల కమిటీ (డిపిసి) నిర్వహించి తదనుగుణంగా పదోన్నతులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ తరహా ముఖ్యమైన దస్త్రాలు హోం మంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరాయని, ఒకటి రెండు రోజుల్లో మరిన్ని ఫైళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టుకు సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్‌లో హోం మంత్రి సబితను ఏ 4గా పేర్కొన్న విషయం తెలిసిందే. సబిత పేరును చార్జీషీట్‌లో చేర్చడంతో కినుక వహించిన ఆమె గత సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సబిత రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరస్కరించారు. అయినప్పటి సబిత విధులకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. మంత్రి సచివాలయానికి రాకపోవడంతో ఆమె చూడాల్సిన దస్త్రాలన్నీ పెండింగ్‌లో పడ్డాయి. వారం రోజులుగా మంత్రి చాంబర్‌కు రాకపోవడంతో కార్యాలయ సిబ్బంది ఆమె నివాసంలోనే విధులకు హాజరవుతున్నారు. దీంతో సచివాలయం జే బ్లాక్ 8 వ అంతస్థులో ఉన్న సబిత కార్యాలయం సందర్శకుల లేమితో బోసిపోయింది.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more