Teluguwishesh ఆడు మగాడ్రా బుజ్జీ ఆడు మగాడ్రా బుజ్జీ Aadu Magaadra Bujji Telugu Movie Review, Aadu Magaadra Bujji Movie Review and Rating, Aadu Magaadra Bujji Review, Aadu Magaadra Bujji Rating, Aadu Magaadra Bujji Movie Stills, Aadu Magaadra Bujji Movie Songs, Aadu Magaadra Bujji Movie Wallpapers, Aadu Magaadra Bujji Movie Trailers, Aadu Magaadra Bujji Movies Photos, Aadu Magaadra Bujji Movies Gallery and more on Teluguwishesh.com Product #: 49020 2/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఆడు మగాడ్రా బుజ్జీ

  • బ్యానర్  :

    కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్ టైన్మెంట్

  • దర్శకుడు  :

    క్రిష్ణారెడ్డి

  • నిర్మాత  :

    ఎమ్. సుబ్బారెడ్డి

  • సంగీతం  :

    శ్రీ కొమ్మినేని

  • సినిమా రేటింగ్  :

    2/52/5  2/5

  • ఛాయాగ్రహణం  :

    సాంటోనియో ట్రెజియో

  • ఎడిటర్  :

    బిక్కిన తమ్మిరాజు

  • నటినటులు  :

    సుధీర్ బాబు, అస్మితా సూద్, అజయ్ తదితరులు

Aadu Magaadra Bujji Movie Review

విడుదల తేది :

డిసెంబర్ 7,2013

Cinema Story

సుధీర్ బాబు (సిద్దూ) ఓ అల్లరిగా తిరిగే జులాయి. తన చిలిపి పనులతో పక్కనుండే వాళ్ళను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా పెద్ద సమస్యగా మారుతారు. దీంతో తండ్రి ప్రసాద్ (నరేశ్) ఇలాంటి కొడుకును ఎందుకు ఇచ్చావు దేవుడా ? అని కోరుకుంటాడంటే సిద్దూ ఎలాంటోడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిద్ధూ ఇందూ(అస్మితాసూద్) ప్రేమలో పడతాడు. ఇందూ అన్నయ్య చెర్రీ (రణధీర్) అంటే సిద్దూకి పడదు. తన ప్రేమకోసం చెర్రీ ని అంజలీ ప్రేమలో పడేటట్లు చేస్తాడు. అంజలీ ప్రేమ విషయం తెలుసుకున్న శంకరన్న చెర్రీపై దాడి చేస్తాడు. చెర్రీ, అంజలీలు విడిపోవడానికి సిద్దూనే కారణమని తెలుసుకున్న ఇందూ అతనికి దూరంగా ఉంటుంది. అయితే శంకరన్నను ఎదురించి విడిపోయిన చెర్రీ, అంజలీలను ఎలా కలిపాడు.చివరికి తన ప్రేమను ఏ మగతనం చూపించి గెలుచుకుంటాడన్నది తెర పై చూడాల్సిందే.

cinima-reviews
ఆడు మగాడ్రా బుజ్జీ

సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ  రిలేటివ్  అయిన సుధీర్ బాబు వారి క్రేజ్ తో వెండితెర పై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్ బాబు. మొదటి చిత్రం ‘ఎస్సెమ్మెస్ ’తో ఫర్యాలేదనిపించి, ఇటీవల వచ్చిన ‘ప్రేమ కథాచిత్రమ్ ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జీ ’ అంటూఓ ఢిఫరెంటు టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ట్రైలర్ లో మాత్రం అలరించాడు. సిక్స్ ప్యాక్ బాడీ చూపించి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా సినిమాలో అంత స‌త్తా ఉందా ?  సుధీర్ మ‌గాడు అనిపించుకొన్నాడా ? లేదా ఈ సినిమా రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

Cinema Review

గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సుధీర్ బాబు గురించి చెప్పుకోవాల్సి వస్తే అది ఒక్కటి సిక్స్ ప్యాక్ బాడీ, ఫైట్స్, డాన్సులతో అలరించాడు. నటనా పరంగా చూస్తే యావరేజ్ గా చేశాడు. ఫైట్స్ ఎనర్జిటిక్ గా చేశాడు. ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని పెంచిన సుధీర్ బాబును దర్శకుడు సరిగా వాడుకోలేదేమో అపినిపించింది. టైటిల్ ని అంత ఫవర్ ఫుల్ గా పెట్టిన పెట్టినా దానికి తగ్గట్లు పాత్రను క్రియేట్ చేయలేక పోయాడు. గత సినిమాల్లో లాగాగే ఇందులో కూడా డైలాగ్ డెలవరి ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఇందులో కథానాయికగా నటించిన అస్మితాసూద్ పెద్దగా ప్రాముఖ్యం ఉన్న పాత్ర దక్కలేదు. మరో పాత్ర పోషించిన అంజలి గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. విలన్ గా అజయ్ ఫర్వాలేదనిపించాడు.అజయ్ కేరిర్‌కు అంతగా పేరు తీసుకురాకపోయినా.. విలన్ రేసులో తాను ఉన్నానని చెప్పుకోవడానికి పనికివస్తుంది. సుమన్, నరేశ్‌లు అతిధి నటుల పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఈ సినిమాలో కుక్క పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. పృథ్వీ, కృష్ణభగవాన్ కామెడీ కొంత ప్లస్ అని చెప్పవచ్చు.

 

 

కళాకారుల పనితీరు :

ఈ సినిమాకు సంగీతం అందించిన శ్రీ ఒకటి రెండు పాటలకు చక్కటి సంగీతం అందించాడు. మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే ఉంది. పాటల్లో సుధీర్ బాబు స్టెప్పులు అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగంలో ఏ మాత్రం కత్తెర్లు వేయకపోవడంతో కొన్ని సీన్లు అనవసరం అనిపించాయి. పాటల కొరియోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల పరంగా సినిమా క్వాలిటీగానే తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా పేలాయి.  కృష్ణారెడ్డి తొలి భాగంగా ఓకే అనిపించాడు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తొలి భాగంపై గ్రిప్‌ను సాధించినట్టు కనిపించినా.. అదే ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించలేకపోయాడు. కుక్క ఎపిసోడ్, కృష్ణ భగవాన్ సీన్లు బాగా పండించాడు. తొలి భాగంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసినా రెండో భాగంలో విఫలం అయ్యాడు. కొత్త తరహా కథలతో వస్తున్న దర్శకులు... రొటీన్ కథను ఎంచుకోవడం కృష్ణారెడ్డి కొంత సాహసామేనప్పటికి.. ఆడు మగాడ్రా బుజ్జీ టైటిల్‌లో ఉండే ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.

చివరగా :

టైటిల్ లో ఉన్నంత ఫవర్ ‘కథ ’లో చూపించలేక పోయాడు