I don't Have any Grudge on Mega Family | మెగా ఫ్యామిలీపై నాకేం పగ లేదు : వర్మ

Varma on mega family target

Open Heart with RK, Director Ram Gopal Varma, Mega Family Controversy, Ram Gopal Varma Mega Family, Mega Family Controversies, Open Heart with RK Varma, Varma on Lakshmi's NTR

Director Ram Gopal Varma responded on Mega Family Controversy in Open Heart with RK Show. He never targeted any specific celebrity and it's completely personal opinion.

మెగా ఫ్యామిలీని కావాలని టార్గెట్ చేయలేదు : వర్మ

Posted: 10/16/2017 09:59 AM IST
Varma on mega family target

వివాదాల వర్మ కొంత కాలం క్రితం ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లో విరుచుకుపడిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టి.. తర్వాత 150వ చిత్రం టైంలో ఏకంగా చిరునే టార్గెట్ చేసి సెటైర్లు వేశారు. వాటిని తమ కుటుంబం చాలా తేలికగా తీసుకుందని చిరు సైతం చెప్పటం.. అలాంటి వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

అయితే తానేం యాంటీ మెగా ఫ్యామిలీ కాదని వర్మ చెబుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర వివాదం కారణంగా ఈ మధ్య వార్తల్లోకెక్కిన ఆయన తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘చిరూ ఫ్యామిలీ ఒన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఫ్యామిలీ పై నాకు గడ్జ్-లవ్ ఉందనేది కరెక్ట్ కాదు’’ అని వర్మ అన్నారు.

ప్రధాని మోదీ కావొచ్చు .. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కావొచ్చు ... సెలబ్రిటీ ఎవరైనా సరే వాళ్లకి సంబంధించి తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతానన్నారు. అంతేగాని సెలక్టివ్ గా తాను చిరూ ఫ్యామిలీని కార్నర్ చేయలేదని తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదాలపై చాలా వరకు క్లారిటీ ఇచ్చే యత్నం చేశారాయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles