TDP to take action against director RGV ఆర్జీవీపై చర్యలకు కదులుతున్న టీడీపీ

Tdp to take action against director ramgopal varma for comments on balayya

TDP to take action on RGV, TDP to charge RGV at Speaker, RGV comments on BalaKrishna, TDP to complain on RGV to Speaker, Director Ram gopal Varma, MLA Roja, Nagari, Balakrishna, Hindupur, Anantapur, Demoralise, Andhra Pradesh Assembly, member of AP Assembly, Andhra Pradesh, Politics

Telugu Desam Party legislative Party is planning to take action on Controversial Director Ram gopal Varma for his comments on cine hero and Hindupur MLA BalaKrishna by complaing on the same to speaker on demoralising the image of AP Assembly and its Member while sessions are going on.

ఆర్జీవిపై చర్యలకు టీడీపీ సన్నధం అవుతుందా.?

Posted: 01/23/2020 04:37 PM IST
Tdp to take action against director ramgopal varma for comments on balayya

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ చర్యలకు పూనుకోనుందా.? అంటే ఔనన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. శాసనమండలిలో వున్న టీడీపీ సభ్యుడి పట్ల అవమానకర రీతిలో.. హద్దుమీరి మరీ ఘాటుగా వ్యాఖ్యానించిన రాంగోపాల్ వర్మపై టీడీపీ చర్యలకు పూనుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. శాసనసభ్యుడిని అందులోనూ శాసనసభలో వుండగా.. దిగిన ఫోటోను ట్రోల్ చేస్తూ ఆయన నోరు జారారు. వ్యక్తులను మెచ్చుకోవడం.. విమర్శించడం అవతలి వ్యక్తి ఇష్టాన్ని బట్టి వుంటుందన్న విషయం తెలిసిందే.

అయితే పదిమందిలో తన అభిప్రాయాలను వెలిబుచ్చే క్రమంలో ఎవరి గురించి వ్యాఖ్యానిస్తున్నామో వారి మనోభావాలకు గాయం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై వుంటుంది. ఇక ఆ వ్యక్తి హోదాతో పాటు ఆ వ్యక్తి ఆ ఫోటోను దిగిన స్థలం.. ఎవరితో దిగారన్న విషయం అన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. అయితే ఆర్జీవీ.. శాసనసభలో వున్న శాసనసభ్యుడిని.. అందులోనూ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంలో విమర్శించడం సభ్యుడితో పాటు శాసనసభను కూడా అవమానించడమే అని టీడీపీ శ్రేణులు అంటున్నారు. దీంతో కాంట్రవర్సీలకు దారితీసేలా ట్వీట్ చేసిన అర్జీవిపై చర్యలకు టీడీపీ నేతలు పూనుకుంటున్నారని సమాచారం.

ఇంతకీ ఏం జరిగిందీ.. శాసనమండలిలోని సభ్యుడిని ఆర్జీవి విమర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? ఇంతకీ ఆ సభ్యుడెవరూ.? అన్న వివరాల్లోకి వెళ్తే.. తాజాగా అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా.. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి నటసింహం బాలయ్యతో ఓ సెల్ఫీ దిగారు. తాజాగా బోయపాటి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రంలో ఆయన గెటప్ మార్చారు. విగ్ లేకుండా నెరసిన గడ్డంతో ఆయన శాసనసభకు వచ్చారు. రూరల్ చిత్రంలో కొత్త లుక్ లో కనిపించిన బాలయ్య.. ఒకేసారి తన తాజా చిత్రం కోసం లుక్ ను మార్చేశారు.

దీంతో మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా సమావేశాలు జరుగుతున్న సమయంలో వాటిని వీక్షించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మండలి గ్యాలరీలోకి తమ పార్టీ సభ్యులతో పాటు చేరుకున్నారు. టీడీపీ శాసనసభ్యులతో కలసి సమావేశాలను తీక్షణంగా పర్యవేక్షించారు. అందరూ ఒకచోట కూర్చోని సమావేశంలో తమ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును వీక్షిస్తుండగా, అక్కడికి కొత్త లుక్ లో వున్న బాలయ్య వచ్చారు. ఆయన మండలి గ్యాలరీకి చేరుకోగానే ఆయన వద్దకు వెళ్లిన నగరి ఎమ్మెల్యే.. సినీనటి, ఏపీఐఐసీ చైర్మన్ రోజా బాలయ్యతో సెల్పీ దిగారు. అమెతో పాటు పలువురు వైసీపీ సభ్యులు కూడా వున్నారు. దానిని అమె తన సోషల్ మీడియాలోనూ అప్ లోడ్ చేశారు.

కాగా ఈ ఫోటోపై ఆర్జీవీ స్పందిస్తూ.. రోజా ఒక హీరోలా ఉన్నారన్నారని కామెంట్ చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే ఆయన కాంట్రావర్సీకి కాలుదువ్వారు. రోజా పక్కనే వున్న బాలయ్యను ఉద్దేశిస్తూ.. ఆమె కుడి వైపున కూర్చున్న వ్యక్తి తనకు తెలియదని సెటైర్లు వేశారు. ఆ ఫోటో ఫ్రేమ్..  రోజా అందాన్ని పాడుచేసేలా ఉందన్నాడు. అంతేగాక, పక్కన కూర్చున్నది దిష్టి బొమ్మనా అంటూ ఎద్దేవా చేశాడు. ఈ ఫోటోను పాడుచేసే వ్యక్తి ఎవరో తనకు తెలియాలంటూ ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ప్రశ్నించాడు. ఈ పోస్ట్ పై బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీవి కామెంట్లపై టీడీపీ చర్యలకు ఉపక్రమించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles