Bigg Boss a Vulgar Show, Arrest Kamal

Case filed against kollywood bigg boss show

Kamal Haasan, Hindu Makkal Katchi, Tamil Bigg Boss Show, Kollywood Bigg Boss, Bigg Boss Kamal Haasan, Bigg Boss Vulgar Show, Bigg Boss Host Arrest, Kamal Bigg Boss Controversies, Bigg Boss Insult Tamil Culture

Kamal Haasan Bigg Boss in Another Controversy. Hindu Makkal Katchi demands arrest Kamal for hosting vulgar show and case filed.

బిగ్ బాస్ ఓ బూతు షో.. కమల్ ను అరెస్ట్ చేయాల్సిందే!

Posted: 07/12/2017 02:46 PM IST
Case filed against kollywood bigg boss show

మనోభావాలు దెబ్బ తినటం అనే మాటకు ఉన్నంత శక్తి మరేయితర పదానికి ఉండదేమో. సినిమాల్లో తమను కించపరిచారంటూ కొన్ని వర్గాలు బ్యాన్ అనే ఆయుధాన్ని వాటిని వాడుతూ.. చివరకు అది తొలగించేదాకా ఊరుకోవు. ఇప్పుడది టీవీ షోలకు పాకిపోయింది. ఈ మధ్యే ప్రారంభమైన కోలీవుడ్ బిగ్ బాస్ ను నిషేధించాలని కోరుతూ సీనియర్ హీరో కమల్ హాసన్ పై కేసు దాఖలు చేశాయి ఓ తమిళ సంఘం.

కమల్ హాసన్ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తమిళుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న షోకి ఆయన పనిచేస్తున్నారంటూ వాళ్లు ఆరోపిస్తు, ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు చాలా విలువైనవి. వాటికి ఓ పద్ధతి ఉంటుంది. కానీ, ఈ బిగ్ బాస్ షో అందుకు విరుద్ధంగా ఉంది. షోలో సెలెబ్రటీలు కెమెరాల ముందు జీవించాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే చోట వారి జీవనం ఉంటుంది. కంచం, మంచం, బాత్రూం వంటివన్నీ ఒకే చోట ఉంటాయి.

ఇది ముమ్మాటికీ మన సంప్రదాయానికి విరుద్ధమైనదే, అంతేకాదు అశ్లీలత కూడా ఉంది. అలాంటి షోను సిగ్గు లేకుండా కమల్ ఎలా నిర్వహిస్తున్నాడు? వెంటనే దాని నుంచి తప్పుకుని, షో నిలిపివేయాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి. అయితే ఇంతకు ముందు ద్రౌపది వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసిన సంఘం హిందూ మక్కల్ కట్చి ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ పై కూడా కేసు వేసి ఇబ్బందులకు గురిచేస్తుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bigg Boss Show  Kamal Haasan  Hindu Makkal Katchi  

Other Articles