Talented Actress Insulted at Trailer Launch Event

Actress insulted at trailer launch

Divya Dutta, Divya Dutta Insulted, Divya Dutta Babumoshai Bandookbaaz, Babumoshai Bandookbaaz Trailer Launch, Babumoshai Bandookbaaz Trailer Review, Babumoshai Bandookbaaz Divya Dutta Apologized, Babumoshai Bandookbaaz Sorry to Divya Dutta, Divya Dutta Cry, Bollywood Actress Insulted

Actress Divya Dutta played a crucial role in the film Babumoshai Bandookbaaz. The makers have launched the trailer of the film recently at an event and invited the cast and crew for the event. But, Divya Dutta was not invited to the stage and she was left in the audiences. Divya Dutta apparently felt hurt about the same, and she became emotional instantly. Later, we heard that the film unit apologized her.

బోల్డ్ బ్యూటీకి ఘోర అవమానం.. ఏడుస్తూ వెళ్లిపోయింది

Posted: 07/12/2017 03:41 PM IST
Actress insulted at trailer launch

ఈవెంట్లలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు కెమెరా కంటికి చిక్కితే చాలూ ఇక రచ్చ రచ్చే. అదే ముఖ్యపాత్రధారుల విషయంలో జరిగితే మాత్రం మేకర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాంటిదే జరగటంతో ఓ ప్రముఖ బాలీవుడ్ నటి కంటతడి పెట్టేసింది.

పంజాబీతోపాటు బాలీవుడ్ లో నటించిన దివ్యా దత్తాకు టాలెంట్ నటిగా పేరుంది. 39 ఏళ్ల ఈ కెరీర్ లో ఆమెకు పాతిక పైగానే అవార్డులు వచ్చాయి. సెలక్టివ్ కథలను ఎంపిక చేసుంటుంది గనుక ఆమె ఉంటే సినిమా హిట్ అవుతుందన్న ఓ నమ్మకం ఉంది. పైగా బోల్డ్ రోల్స్ కు ఆమె పెట్టింది పేరు. అలాంటిది ఆమె కొత్త చిత్రం ట్రైలర్ లాంఛ్ సందర్భంగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ లీడ్ రోల్ లో 'బాబూమోషాయ్ బందూక్ బాజ్' అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ను మంగళవారం అఫీషియల్ గా లాంఛ్ చేశారు నిర్వాహకులు. ఈ సినిమాలో దివ్యా దత్తా కీలకపాత్ర పోషించటంతో ఆమె కార్యక్రమానికి హాజరైంది.

నిర్వాహకులు చిత్ర బృందంను అంతా స్టేజిపైకి పిలిచారు. అయితే దివ్యను మాత్రం మరిచిపోయారు. దీంతో ఆమె ప్రేక్షకుల మధ్యే ఉండిపోయింది. కాసేపటికి తనను పట్టించుకోలేదన్న ఉద్వేగానికి లోనైన ఆమె ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇది అక్కడే ఉన్న కొన్ని కెమెరాలకు చిక్కింది. ఇక దివ్య వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ క్షమాపణలు చెప్పటంతో ఆమె శాంతించినట్లు తెలుస్తోంది. నవాజుద్దీన్, బదితా బాగ్ మెయిన్ రోల్స్ లో, శ్రద్ధా దాస్, మురళీ శర్మలు ఇతర పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రం ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babumoshai Bandookbaaz  Divya Dutta  Trailer Review  

Other Articles