Top Producer Comments on Rave Parties and Drug Addiction

Maa press meet over drug culture in hyderabad

Tollywood Drug Mafia, MAA Press Meet, Allu Aravind, Suresh Babu, Telangana Excise SIT Notices, Allu Aravind on Drug Culture, Allu Aravind Suresh Babu Drug Links, Tollywood Drug Links, Allu Aravind Warn Heroes

MAA press meet on Tollywood Drug Mafia. Producer Allu Aravind Serious Warning 10 Young Heroes For Taking Drugs. Telangana Excise SIT serve notices to 10 celebrities.

టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్.. మా పెద్దల ప్రెస్ మీట్.. ఏం జరుగుతోంది?

Posted: 07/12/2017 02:05 PM IST
Maa press meet over drug culture in hyderabad

టాలీవుడ్ లోనూ డ్రగ్స్ మాఫియా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకుని పలువురు సెలబ్రిటీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కూడా. అయితే వాళ్ల పేర్లు బయటకు వస్తాయా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న టైంలో మా పెద్దలు హడావుడిగా ప్రెస్ మీట్ నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, రచయిత పరుచూరి వెంకటేశ్వర్లు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

తెలంగాణలో డ్రగ్స్ రాకాసిని అంతమొందించేందుకు పోలీసులు అద్భుతంగా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా అల్లు అరవింద్ ప్రశంసించాడు. 'సినీ పరిశ్రమలో 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. వారికి నేను చెప్పేది ఏంటంటే... మీరు అచ్చం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టు వ్యవహరిస్తున్నారు. మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలియదనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. మీకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంది. ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? డ్రగ్స్ తీసుకున్నారన్న ప్రతి రికార్డు వారి వద్ద వుంది" అని తెలిపాడు. అయితే కేవలం మీ భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని పోలీసులు ఉపేక్షిస్తున్నారు అని ఆయన తెలిపాడు.

పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి

ఇప్పటికి అయిందేదో అయిపోయిందని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించాడు. సినీ పరిశ్రమలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చి, సమాజానికి కీడుగా మారితే తీవ్రంగా నష్టపోయేది మీరేనని సూచించాడు. ముంబైలో రేవ్ పార్టీ కల్చర్ ఇక్కడికి పాకిపోయిందని, అక్కడ కొంత మంది చేసే పనులను మేము ఇక్కడా చేస్తామంటారా? అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకోండంటూ ఘాటుగా హెచ్చరించాడు. ఇక మాదక ద్రవ్యాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిచ్చాడు. ఇక మరో నిర్మాత సురేష్ బాబు డ్రగ్స్ కి వ్యతిరేకంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీలను నిర్వహిస్తామని పేర్కొన్నాడు.

అందుకే రియాక్ట్ అయ్యారా?

గతంలో టాలీవుడ్ డ్రగ్ లింకులు అనేకం బయటపడ్డాయి. అయితే ఆ టైంలో స్పందించని మా ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యిందన్న విషయాన్ని విశ్లేషిస్తే... డ్రగ్స్ డొంక పెద్ద స్థాయిలోనే కదలటంతోనే వాళ్లు ఇలా ప్రెస్ మీట్ పెట్టినట్లు స్పష్టమౌతోంది. ఇప్పటికే 3 యువహీరోలు, 4 దర్శకులు, 2 నిర్మాతలుసహా ఓ ఫైట్ మాస్టర్ కు ఎక్సైజ్ సిట్ నోటీసులు అందజేసింది. ఆరురోజుల్లో విచారణకు హాజరుకాకుంటే కఠిన చర్యలు ఉంటాయని అందులో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా అలాంటి వాళ్లేనన్న భావనను తొలగించేందుకే ఇప్పుడు ఇలా మీడియా సమావేశం నిర్వహించిందని అర్థమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Mafia  MAA Press Meet  Allu Aravind  

Other Articles