ఆ కోలీవుడ్ హీరోయిన్ ఎంత పని చేసింది! | Another Kollywood Actress Secret Wedding.

Tamil actress married secretly

Actress Manisha Yadav, Manisha Yadav Secret Wedding, Kollywood Actress Secret Marriage, Actress Secret Marriage, Manisha Yadav Husband, Manisha Yadav Mother, Manisha Yadav Movies, Trisha Illana Nayanathara Actress, Tuniga Tuniga Actress Wedding

Actress Manisha Yadav was secretly married to her long time boyfriend. With the success of her Tamil debut film, she was flooded with a lot of offers. She was last seen in the films like Adalal Kaadal Seyavir, Jannal Oram, Pattai Kelappanum Pandiya, Trisha Illana Nayanathara and few others. Of late, she is not accepting films but looks like settled down to love.

సీక్రెట్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ మనీషా

Posted: 02/13/2017 08:50 AM IST
Tamil actress married secretly

మొన్నామధ్యే పెద్దలు కాదన్నా ఎదిరించి మరీ డిస్ట్రిబ్యూటర్ కార్తీని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది బిచ్చగాడు హీరోయిన్ బిచ్చగాడు హీరోయిన్ సట్నా టైటస్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆపై మళ్లీ పెద్దల ఆశీర్వాదంతో మరోసారి ఒకటయ్యారు ఆ జంట. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ సీక్రెట్ గా వివాహం చేసుకోవటం సౌత్ లో సెన్సేషన్ గా మారింది.

తమిళ హీరోయిన్ మనీషా యాదవ్ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవటం కోలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. వజక్కు ఎన్ 18/9 చిత్రం ద్వారా ఆరంగ్రేటం చేసిన మనీషా ఆపై 'ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌వీర్', 'జన్నల్‌ ఓరం', 'త్రిష ఇల్లన్న నయనతార' తదితర చిత్రాలతో పాపులర్ అయ్యింది. తెలుగులో తూనీగ తూనీగ చిత్రంలో కూడా నటించింది.

రెండు రోజుల క్రితం తాను ప్రేమించిన బెంగళూరు వ్యాపారి వార్నిడ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది మనీషా. ఇందుకు సంబంధించి మీడియాకు సారీ చెబుతూ ట్విట్టర్ లో ఫోటోలను కూడా ఉంచింది. ఇక ఈ పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని మనీషా తల్లి యమున వెల్లడించింది. కాగా, పెళ్లి తరువాత తను నటించాలా? వద్దా? అన్నది భర్త నిర్ణయంపై ఆధారపడి వుందని యమున తెలిపింది. గత కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేని ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా, తనను కోలీవుడ్ కు పరిచయం చేసిన బాలాజీ శక్తివేల్ ను సైతం మనీషా పెళ్లికి పిలవకపోవటం చర్చనీయాంశంగా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Actress  Manisha Yadav  Secret Wedding  

Other Articles