అమ్మ ఆత్మ.. దీవెనలు ఎవరికంటే... | RGV tweets on Panneerselvam and Sasikala.

Rgv again tweets on tamil nadu politics

Jayalalithaa Spirit, Director Ram Gopal Varma, RGV Tamil Nadu Politics, Sasikala Panneerselvam RGV, O P Selvam Ram Gopal Varma, Ram Gopal Varma, RGV on OPS Sasikala, RGV Tweets, Ram Gopal Varma Twitter

Director Ram Gopal Varma tweets on Tamil Nadu Politics. what Jayalalitha's spirit is thinking and who she will finally bless between Sasikala and O P Selvam?.

తమిళ రాజకీయ అనిశ్చితిపై వర్మ ట్వీట్లు

Posted: 02/13/2017 07:55 AM IST
Rgv again tweets on tamil nadu politics

ఓవైపు అనిశ్చితి, మరోవైపు ఎవరెటు వెళ్తున్నారో అర్థకాకుండా కన్ఫూజ్యన్ తో రసవత్తరంగా సాగుతున్న తమిళ రాజకీయాలపై ఇప్పటిదాకా తనదైన శైలిలో స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాత రోమన్ సామెత ‘యూ టూ బ్రూటస్?’ గుర్తుకొస్తోందని అన్నారు. అంతటితో ఆగకుండా శశికళ, పన్నీర్ సెల్వంపైనా ఆర్జీవీ వ్యాఖ్యలు చేశాడు.

గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని శశికళ ఆశ్చర్యపడుతోందని ట్వీట్‌లో పేర్కొన్న రాంగోపాల్ వర్మ అంతకంటే ముందు తానే ఓ బానిసలా ప్రవర్తించిన విషయాన్ని మాత్రం శశికళ మర్చిపోయిందని పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి పీఠం కోసం అటు ‘అమ్మ’ నెచ్చెలి, ఇటు ఆమె వీర విధేయుడి మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలుపెవరిదో తెలియక ఇటు ప్రజలు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా అయోమయానికి లోనవుతున్నాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘జయలలిత ఆత్మ ఏమని ఆలోచిస్తుందో?’’ అంటూ సందేహం వెలిబుచ్చాడు. ‘అమ్మ’ ఆత్మ చివరికి పన్నీర్ సెల్వంను దీవిస్తుందా? లేక నెచ్చెలి శశికళను దీవిస్తుందో? అని అనుమానం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ ద్వారా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Twitter  Tamil Nadu Politics  Sasikala Natarajan  Panneerselvam  

Other Articles