రెమ్యునరేషన్ విషయంలో తగ్గాడా?.. అంత సీన్ లేదు | Ravi Teja not compromise in Remuneration.

Ravi teja to share the profits for his next

Hero Ravi Teja, Ravi Teja Remuneration, Ravi Teja Profits, Ravi Teja 2017 Movies, Hero Ravi Teja, Ravi Teja Upcoming Movies, Ravi Teja Compromise

Ravi Teja Not Compromised in Remuneration. Mass Raja to share the profits for his Next. He has been offered Rs 5 crores as remuneration and he has been offered to share 20% profits which convinced.

రవితేజ రెమ్యునరేషన్... లెక్క తేలింది

Posted: 02/13/2017 11:18 AM IST
Ravi teja to share the profits for his next

ఫ్యామిలీతో గడిపేందుకు లాంగ్ హాలీడేస్ తీసుకున్న మాస్ రాజా రవితేజ ఆ రీజన్ తోనే సినిమాలకు ఇంత గ్యాప్ వచ్చిందని చెప్పటం చూశాం. అయితే బెంగాల్ టైగర్ తర్వాత అడ్డగోలుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయటంతోనే మూడు ప్రాజెక్టులు చేతి నుంచి జారవిడుచుకున్నాడన్నది ఓపెన్ సీక్రటే. సినిమా మార్కెట్టే 20-25 కోట్ల మధ్య ఉంటే, రెమ్యునరేషన్ కింద 8 నుంచి 9 కోట్ల మధ్య డిమాండ్ చేస్తున్నాడన్న వార్త ఒకటి వినిపించింది.

కట్ చేస్తే ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్న రవితేజ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా? అన్న ప్రశ్న తలెత్తింది. అయితే దీనిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. రెమ్యునరేషన్ తోపాటు షేర్ ప్రాఫిట్ ను కూడా అందుకోబోతున్నాడంట. సుమారు 5 కోట్ల పారితోషకం, సినిమా హిట్ అయితే లాభాల్లో 20 శాతం ఈ మాస్ రాజా ఖాతాలో పడబోతుంది. ఈ లెక్కన ఎంత లేదన్న సుమారు ఇంతకు ముందు అతను డిమాండ్ చేసినంతే అందుకోబోతున్నాడన్న మాట. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఆ లాభం మరింత ఎక్కువ ఉండబోతుంది.

ఇక ఇప్పటికే టచ్ చేసి చూడు షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ జూన్ కల్లా ఆ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు తెగ శ్రమిస్తున్నాడు. మరోవైపు ఈ యేడాది లోనే అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఓ అంధుడి రోల్ చేయబోతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Remuneration  Share Profits  

Other Articles