మొత్తానికి సమంత సాధించేసింది.. ఏడ్పించేసింది | Naga Chaitanya breaks down because of Samantha.

Naga chaitanya crying moments for samantha

Naga Chaitanya, Samantha Ruth Prabhu, Naga Chaitanya Samantha, Samantha's death scene in Theri, Chaitu breaks down Samantha, Samantha happy with Naga Chaitanya breaks down

Naga Chaitanya breaks down after watching Samantha's death scene in Theri.

సమంత దెబ్బకి చైతూ కన్నీరు పెట్టాడంట!

Posted: 12/22/2016 08:39 AM IST
Naga chaitanya crying moments for samantha

'అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించేశానని తెగ సంబరపడిపోతుంది సౌత్ డాల్ సమంత . నిన్న సాయంత్రం ‘ఫేస్ బుక్ వీడియో చాటింగ్’ లో ఆమె అభిమానులతో పిచ్చపాటి కబుర్లాండింది. హాయ్ అక్కినేని సమంత.. అన్న అభిమానులతో .. నేనింకా అక్కినేని సమంత కాలేదంటూ ఛాటింగ్ మొదలుపెట్టింది

ఈ సందర్భంగా ఒక అభిమాని మాట్లాడుతూ, విజయ్ ‘తెరీ(పోలీస్)’ చిత్రంలో అందరినీ ఏడిపించారు? అని ప్రశ్నించారు. దీనికి సమంత స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో నేను చనిపోతాను. ఆ సన్నివేశం చేసే ముందు దర్శకుడు అట్లీతో చాలా సేపు మాట్లాడాను. థియేటర్లో అందరినీ ఏడిపించేలా నా ప్రయత్నం చేస్తానని అట్లీకి చెప్పాను. ఆ సీన్ పండింది. ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాను. నేను చనిపోయే సన్నివేశం వచ్చినప్పుడు.. స్క్రీన్ వైపు చూడకుండా, థియేటర్లో పక్కన కూర్చున్న వారిని చూస్తూ కూర్చున్నా. చైతన్య కూడా నా పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. మొత్తానికి నేను అనుకున్నది చేశాను అని చెప్పింది నవ్వేస్తూ సమాధానమిచ్చింది సామ్.

తన పేరులో సౌండింగ్‌ రొమాంటిక్‌గా ఉందంటూ ఓ అభిమాని చెప్పటంలో మురిసిపోయి, అంతకు ముందెన్నడూ నా పేరు రొమాంటిక్‌గా ఉందనే మాట నేను వినలేదు. ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలంటూ తెలిపింది. ఇక ఈ యేడాదిలో ఐదు చిత్రాలతో సందడి చేసిన ‘సమంత’ వచ్చే ఏడాది మరో ఐదు సినిమాలతో రాబోతుందని చెప్పింది. కానీ, అందులో తెలుగు చిత్రం ఉందో లేదో అని మాత్రం చెప్పలేదండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya breaks down  Samantha's death  Theri Movie  

Other Articles

Today on Telugu Wishesh