పోసాని మెగా భజన.. పవన్ ను పవర్ స్టార్ చేసిందే ఆయనంట..| Posani praised mega family at Dhruva Pre Release function.

Story behind pawan power star tagline

Pawan Kalyan, Posani Krishna Murali, Posani Pawan, Pawan Power Star tagline, Posani Power Star, Pawan kalyan Posani, Posani pawan kalyan, Power Star tagline, Story behind Pawan Power Star, Power Star Tagline Story, Posani about Power Star

Posani Krishna Murali about Pawan Kalyan Power Star title.

పోసాని నోట పవర్ స్టార్ మాట

Posted: 12/05/2016 11:45 AM IST
Story behind pawan power star tagline

వేదిక ఏదైనా సరే పవర్ స్టార్ అన్న ఒక్క పదం చాలూ ఆటోమేటిక్ గా విజిల్స్, క్లాప్స్ వచ్చి పడటానికి. పవన్ కళ్యాణ్ మనిషి ఎంతటి ఎనర్జీ ఉన్నవాడో, అంతలా సూటయిపోయింది ఆ బిరుదు అతనికి. మరి అలాంటి ట్యాగ్ లైన్ అసలు పవన్ కి ఎలా వచ్చి చేరింది. దాని వెనుక ఉంది కథెంటో ధృవ ప్రీ రిలీజ్ పంక్షన్ లో చెప్పేశాడు రచయిత కమ్ నటుడు పోసాని కృష్ణమురళి.

పవన్ కు ‘పవర్ స్టార్’ బిరుదు ఇచ్చింది తానే అని ఆయన వెల్లడించాడు. సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు పోసాని ఆస్థాన రచయిత అన్న సంగతి తెలిసిందే. సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ ‘గోకులంలో సీత’ సినిమా చేశాడు. ఆ సినిమా సందర్భంగానే తాను పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చానని, అప్పటి నుంచే స్క్రీన్ పై ఆ పవర్ స్టార్ నేమ్ ప్లేట్ దర్శనమిస్తోందని తెలిపాడు.(పవన్ గురించి మాట్లాడను)

మొత్తానికి పవన్ నిజంగానే ఆ బిరుదుకు సార్థకం చేసుకున్నాడన్న పోసాని వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా గోల గోల చేశారు. ఈ వేడుకలో మెగా హీరోలు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ల మీదా ప్రశంసలు కురిపించాడు పోసాని. మెగాస్టార్ చిరంజీవి కొడుకైనప్పటికీ చరణ్ ఎంతో కష్టపడతాడని.. అతడి కష్టం అసామాన్యమైందని పోసాని అన్నాడు. బన్నీ టాలీవుడ్లో నెంబర్ వన్ డ్యాన్సర్ అని పోసాని కితాబిచ్చాడు. మొత్తానికి కేటీఆర్-చెర్రీ ఫెండ్ షిప్, అవసరమైతే తాను వైజాగ్ పంక్షన్ కి కూడా హాజరవుతానన్న కేటీఆర్ వ్యాఖ్యలు, అరవింద స్వామిని వయసైపోయిందని వారిద్దరు ఆటపట్టించడం, రకుల్ హాట్ థై షో, రానా విషెష్... ఇలా సాగింది ధ్రువ పంక్షన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Power Star  Pawan kalyan  Posani Krishna Murali  

Other Articles