చిరు ప్రజారాజ్యం టికెట్లు అమ్ముకోవటం, పవన్ జనసేన గురించి.... | posani shocking comments on Chiru and pawan

Posani shocking comments on chiru and pawan

Posani not intrested on Pawan, posani shocking comments on Chiru, Posani praises Chiru, Posani pawan kalyan, Posani not intrested in pawan, Posani Janasena, Posani Praja Rajyam, Posani Pawan clash

posani shocking comments on Chiru, pawan kalyan and janasena also.

మెగా బ్రదర్స్ పై పోసాని షాకింగ్ వ్యాఖ్యలు

Posted: 10/03/2016 03:36 PM IST
Posani shocking comments on chiru and pawan

అంతా తనకు మెంటల్ ఉందని అనుకుంటున్నారని.. అలా అయితే తాను ఈపాటికే పిచ్చాసుపత్రిలో ఉండేవాడిని కదా రాజా! అంటున్నాడు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. ముక్కుసూటిగా, నిర్భయంగా నిజాలు మాట్లాడుతాను గనకే నా గురించి ఇలా అనుకుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్, రాజకీయాలు గురించి అడిగిన యాంకర్ ను తనదైన స్టైల్ తో ఉక్కిరి బిక్కిరి చేశాడు.



ప్రస్తుత రాజకీయాలు, పవన్ కళ్యాణ్ పై స్పందించాల్సిందిగా పోసానిని కోరగా, దానికి పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. పవన్ ఉసెత్తటమే ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తించాడు. పవన్ మాలాగే ఓ నటుడు. అసలు తన గురించి మాట్లాడటానికి నాకేం అవసరం. నేను ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే... నిజాయితీపరుడైనా అయి ఉండాలి, లేదా అవినీతి పరుడైన అయి ఉండాలి. నాకు సంబంధం లేని వ్యక్తి గురించి నేనెందుకు మాట్లాడతానయ్యా అంటూ ఫైరయ్యారు. ఇక జన సేన గురించి మాట్లాడుతూ... ఆ పార్టీ ఏంటో తనకేమీ అర్థం కావటం లేదని, అది అర్థమయ్యాకే మాట్లాడితే బావుంటుందని చెప్పాడు.



చిరంజీవి గురించి మాట్లాడుతూ... ప్రజా రాజ్యం పెట్టిన సమయంలో టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఆయన నిజాయితీపరుడు. నాకు ఆయన ఫ్రీగానే టికెట్ ఇచ్చాడు. ఇండస్ట్రీ నుంచి ఆయన టికెట్ ఇచ్చింది నా ఒక్కడికే. ఎన్నికల్లో రూపాయి ఖర్చుపెట్టలేదు అందుకే ఓడిపోయా అంటూ చెప్పుకోచ్చాడు. ఇప్పుడు చిరు తిరిగి ప్రజారాజ్యం ప్రారంభించిన ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకోచ్చాడు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani Krishnamurali  Chiru  Pawan Kalyan  

Other Articles