బంఫరాఫర్ : పాత నోట్లతో రండి.. మా సినిమా చూడండి | This Kannada film accepted old 500 and 1000 notes.

Old notes to be accepted for this movie

Nataraja Service Movie, Old notes for Nataraja Service, Nataraja Service movie old notes offer, Old Notes accepted, Theaters accepted 500 and 1000 notes, Sharan nataraja Service movie

Old notes to be accepted for Kannada film Nataraja Service tickets.

ఆ సినిమాకు పాత నోటు కష్టాలు ఉండవంట

Posted: 11/15/2016 01:44 PM IST
Old notes to be accepted for this movie

నోట్ల మార్పిడి కష్టాలతో జనాలంతా బిజీగా ఉంటే, మరోవైపు దేశ సినిమా రంగం మొత్తం బిజినెస్ లేక అల్లలాడిపోతుంది. ఆర్థిక లావాదేవీలు చాలావరకు ఆగిపోవటంతో కొన్నింటికి షూటింగ్ పై ప్రభావం పడింది. అయితే మరి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి. అల్రెడీ గత వారం రిలీజ్ అయిన వాటికి అతిగతి లేదు. థియేటర్ యాజమాన్యాలు కూడా చిల్లర కష్టాలతో సతమతమయిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ వారం రావాల్సిన చిత్రాలపై డైలామాలో పడ్డారు నిర్మాతలు.

ఇదిలా ఉంటే ఓ కన్నడ సినిమా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ అయి తీరుతుందంట. శరణ్, మయూరి అప్ కమింగ్ హీరోహీరోయిన్ తో నటరాజ సర్వీస్ అనే చిత్రం తెరకెక్కింది. కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్, సాయి కుమార్ సొదరుడు రవిశంకర్ కూడా యాక్ట్ చేశారు. సినిమా ఈ వారమే రిలీజ్ కావాల్సి ఉంది. నోట్ల వ్యవహారంతో ప్రస్తుతం కర్ణాటక లో కూడా థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటరాజ సర్వీస్ టీం ఓ బంఫరాఫర్ ప్రకటించింది.

పాత 500, వెయ్యి నోట్లతో తమ సినిమాను ఎంచక్కా చూడండి అంటూ ప్రకటన జారీ చేసింది. అలాగని మొత్తంగా కాదు. అక్కడ టికెట్ ధర 90 రూపాయలు. అంటే మీరు ఒక్క టికెట్ కొంటే మిగతా చిల్లర ఇచ్చేస్తారన్నమాట. ఎలాగూ కామెడీ చిత్రం కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్తే ఈజీగా 500, 1000 ఖర్చైపోతుందని వారి ఫ్లాన్. ఈ మేరకు చిల్లర ఇచ్చేందుకు థియేటర్ యాజమాన్యాలు కూడా అంగీకరించటంతో ఈ వారం నటరాజ సర్వీస్ రిలీజ్ కు సిద్ధమైపోయింది. అన్నట్లు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండటమే కాదు.. ఓ పాట కూడా పాడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nataraj Service  Kannada Movie  500 and 1000 notes  

Other Articles

Today on Telugu Wishesh