బన్నీ వర్సెస్ పవన్.. కొత్తగా ఈ ట్విట్టర్ గొడవేంటి? | Stylish Star bigger than Power Star!

Bunny beat pawan kalyan there only

Pawan kalyan, Allu Arjun, Pawan kalyan Twitter, Allu Arjun Twitter, Bunny Twitter, Allu Arjun Million Mark, Pawan Twitter, Stylish Star bigger than Power Star, Power Star Stylish Star, Pawan and Bunny, Bunny Million mark, Pawan twitter Million Mark

Tollywood Discussed about comparison between Pawan Kalyan and Allu Arjun about Twitter Followers.

పవర్ స్టార్ ని నిజంగానే మించిపోయాడా?

Posted: 11/15/2016 01:33 PM IST
Bunny beat pawan kalyan there only

ఇప్పుడున్న అగ్రహీరోలకు కూడా సాధ్యం కానీ ఓ రేర్ ఫీట్ ను అవలీలగా చేసి పడేశాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వరుసగా 50 కోట్ల చిత్రాలను ఇవ్వటమే కాదు, పరభాషలో (మళయాళం) కూడా ఫెవరేట్ స్టార్ గా మారిపోయాడు.  అయితే ఇప్పుడు కొత్తగా మొదలైన డిస్కషన్ ఏంటంటే.. బన్నీ ప్యాన్స్ విషయంలో పవర్ స్టార్ ను నిజంగా మించిపోయాడా?

నిజంగానే కాకపోతే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో... పవన్ కళ్యాణ్ 2014 ఆగష్టులో ట్విట్టర్ లో చేరాడు. ఆ సమయంలో అశేషంగా అభిమానులు ఆ ఖాతాను ఫాలోఅయ్యారు. ప్రస్తుతం పవన్ ఖాతాలో 9 లక్షల దాకా ఫాలోవర్లు ఉన్నారు. ఇక బన్నీ రికార్డును చూద్దాం.  2015 ఏప్రిల్ లో జాయిన్ కాగా, రీసెంట్ గా మిలియన్ మార్క్ ను అందుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ఖాతాలో ఇప్పుడు 10 లక్షల కంటే పైగానే అభిమానులు ఫాలోఅవుతున్నారు. పవర్ స్టార్ కి సినీ అభిమానులతోపాటు, రాజకీయాంశాలతో కూడా సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు కేవలం సినిమా సెలబ్రిటీగా ఉన్న బన్నీకి ఈ రేంజ్ లో అభిమానులు ఉండటం నిజంగానే గొప్ప అన్నది కొందరి వాదన.

సెలబ్రిటీలు సాధారణంగా తమ పర్సనల్ అకౌంట్లను మెయింటెన్ చేసేందుకు సమయం ఉండదు. అలాంటప్పుడు వారు పర్సనల్ స్టాఫ్ ను నియమించుకుంటారు. పవన్ కి మాత్రం అలా ఎవరూ లేరంట. అందుకే కేవలం రాజకీయపరమైన అంశాలు తప్ప, వేరే విషయాలపై పవన్ స్వయంగా స్పందించడనేది మరి కొందరు చెబుతున్న వాదన. ఇక ఇంకోందరైతే మెగా ఫ్యామిలీ ఒక్కటే ఇండస్ట్రీలో లేదని, మహేష్ లాంటి హీరోలు మిలియన్ మార్క్ ఎప్పుడో దాటేశారని మధ్యలో దూరుతున్నారు.

అయితే కేవలం సెలబ్రిటీలను సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా క్రేజ్ ను లెక్కగట్టం అస్సలు కరెక్ట్ కాదనేది సినీ పండితుల అభిప్రాయం. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవాళ్లకు ఫాలోవర్లు ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటారన్నది వారి వివరణ.  ఆ లెక్కన భీభత్సమైన క్రేజ్ ఉన్న పవన్ ను బన్నీ మించిపోయాడన్నది జస్ట్ అప్రస్తుతమైన వార్తే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Allu Arjun  Twitter Followers  

Other Articles