బ్రేకప్ తో చుక్కలు చూపించిన సినిమా వచ్చేస్తోంది | Jagga Jasoos firstlook out

Ranbir kapoor jagga jasoos first look released

First look jagga jasoos, jagga jasoos firstlook, Ranbir Kapoor, Ranbir Kapoor and Katrina Kaif, Ranbir and Katrina Jagga Jasoos,

First look jagga jasoos Ranbir Kapoor reveals his inner child in Jagga Jasoos.

అర్రె.. అచ్చం హ్యారీ పోటర్ లా ఉన్నాడే!

Posted: 11/15/2016 02:57 PM IST
Ranbir kapoor jagga jasoos first look released

బాలీవుడ్ లో మాజీ ప్రేమికులుగా ఉన్న వారిద్దరికీ ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. కొంతకాలంగా సరైన హిట్లు లే్క ఇద్దరూ ఢీలా పడిపోయి ఉన్నారు. ఇక ఇప్పుడు ఇద్దరూ ఒకే చిత్రంతో మరోసారి మన ముందుకు వచ్చి అదృష్టం పరిష్కరించుకోబోతున్నారు.

ప్రోషెషనల్ గానే కాదు.. పర్సనల్ గా కూడా బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్, కత్రినాకైఫ్ ల మధ్య జగ్గా జాసూస్‌ చిత్రం పెద్ద చిచ్చే పెట్టింది. వారిద్దరి బ్రేకప్ కంటే ముందే కన్ఫర్మ్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత నిర్మాతలకు చుక్కలు చూపించింది. దీంతో రెండేళ్ల క్రితం రావాల్సిన ఈ సినిమా ఎలాగోలా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసుకుంది.

ఇక చిల్డ్రన్స్ డే విషెష్ చెబుతూ ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ను వదిలింది చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్. హస్టల్ లో స్టూడెంట్ గా రణ్ బీర్ చేసే అల్లరి ఇందులో కనిపిస్తుంది. బ్రౌన్ కలర్ జుట్టు, కళ్లజోడు చూడటానికి అచ్చం హ్యారీ పోటర్ లా భలే ఉన్నాడు. అయితే ఈ సినిమా ముక్కలు, ముక్కలుగా షూటింగ్ జరుపుకోవటంతో ఫైనల్ అవుట్ ఫుట్ పైన కాస్త సస్పెన్స్ నెలకొంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రీతం సంగీతదర్శకుడు కాగా, ఏప్రిల్ 7 2017న జగ్గా జాసూస్ విడుదల కానుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga jasoos  First look  Ranbir Kapoor  

Other Articles

Today on Telugu Wishesh