నరుడు డోనరుడిగా మారటం వెనక కథ | Sumanth Naruda Donaruda Trailer released by Mahesh Babu

Sumanth naruda donaruda trailer released by mahesh babu

positive buzz on Sumanth Naruda Donaruda Trailer, Naruda Donaruda Trailer, Sumanth Naruda Donaruda Trailer, Naruda DONARUda

Sumanth Naruda Donaruda Trailer released by Mahesh Babu and get good response.

నరుడిని డోనరుడిగా చేసిందెవరు?

Posted: 09/27/2016 03:33 PM IST
Sumanth naruda donaruda trailer released by mahesh babu

రీమేక్ తో అయినా గట్టి హిట్ కొట్టాలని భావిస్తున్న టాలీవుడ్ సుమంత్ బాలీవుడ్ లో ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన విక్కీ డోనర్ ను వదులుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేయగా, ఏకంగా మహేష్ బాబుతోనే ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయించాడు సుమంత్. ట్రైలర్ రిలీజ్ చేశాక సుమంత్ కి అండ్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు మహేష్. మరి పాజిటివ్ బజ్ ఉన్న ఈ చిత్రంలో ఏముందో చూద్దామా?.

పిల్లలు లేని వారికి ట్రీట్ మెంట్ చేసే వైద్యుడు ఆంజనేయులు పాత్రలో తనికెళ్ల భరణి కనిపించనున్నాడు. డోనర్ దొరక్కపోవటంతో డల్ అయిపోయిన ఆ డాక్టర్ కి ఆపద్భాందవుడిలా ఎదురవుతాడు ఓల్ట్ సిటీ అబ్బాయి విక్కీ. తొలుత ఒప్పుకోని విక్కీ, ఆపై డబ్బు అవసరంతో ఆ పనికి ఒప్పుకుంటాడు. ఇక్క అక్కడి నుంచి నవ్వులే నవ్వులు... ట్రైలర్ ఆద్యంతం హోరెత్తించే డైలాగులు.. సుమంత్ బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివిరీ అంతా చక్కగా కుదిరాయి. ఇక హీరోయిన్ బ్యాంకు ఉద్యోగిగా బెంగాలీ బ్యూటీ పల్లవి సుభాష్.. అషిమా రాయ్ పాత్రలో కనిపించనుంది.

 

హ్యాండ్రీక్ట్రాప్ట్ లో పని చేస్తున్నానని హీరో చెప్పటం, చివర్లో పెళ్లి చూపుల్లో స్పెర్మి కల్చర్ అని చెప్పటం, చివర్లో హాఫ్ టీ స్ఫూన్ అయినా అంటూ... తనికెళ్ల చెప్పే ట్రయిలర్ ఎండ్ అయ్యింది. ఇకపోతే ట్రైలర్ తోనే సినిమా కాన్సెప్టు మొత్తాన్ని చక్కగా చెప్పేశాడు. కొత్త కుర్రాడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు.. క్షణం ఫేమ్ శ్రీచరణ్ సంగీతం అందించాడు. బాలీవుడ్ లో విక్కీ డోనర్ కు సినిమాటోగ్రఫీ అందించిన షానియల్ డియోల్ తెలుగుకు కూడ పని చేయటం విశేషం. దీపావళికి చిత్రం విడుదల చేయాలని సుమంత్ ఆలోచిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naruda DONARUda  Trailer  Sumanth  Tanikella Bharani  

Other Articles