జక్కన్న కి కాలేలా ఎన్టీఆర్ ఆ రాత్రి ఏం చేశాడు | Rajamouli Completes 15 Golden years in Tollywood

Rajamouli completed 15 years industry and tweet

Rajamouli Funny Tweets, Rajamouli Completes 15 Golden years, Rajamouli Student No.1 Release date, September 27 special day for Rajamouli, Rajamouli completed 15 Years, Rajamouli funny Tweets about NTR, NTR and Rajamouli in one room, Rajamouli anger on NTR, Rajamouli 15 years tweets

Rajamouli Completes 15 Golden years in Tollywood.

పదిహేనేళ్ల ప్రస్థానంపై రాజమౌళి ట్వీట్స్

Posted: 09/27/2016 04:25 PM IST
Rajamouli completed 15 years industry and tweet

ఒక తెలుగు సినిమా ఖండాంతరాలు దాటుతుందని, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమౌతుందని ఎవరైనా ఊహించగలమా? కానీ, దాన్ని సుసాధ్యం చేసి చూపించాడు దర్శకధీరుడు రాజమౌళి. పెద్దగా ట్విస్ట్ లు లేకుండా, రోమాంచిత సన్నివేశాల్లో ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశాడు రాజమౌళి అలియాస్ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేసిన జక్కన్న అంత గొప్ప విజయం సాధించినప్పటికీ కర్మయోగిలా చాలా సింపుల్ గా ఉంటాడు. ఈరోజుకి(సెప్టెంబర్ 27నాటికి) ఇండస్ట్రీకి వచ్చి సరిగ్గా 15 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు.

'పదిహేనేళ్ల క్రితం దర్శకుడిగా పరిచయం అవ్వటం, 25 ఏళ్ల క్రితం ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరటం వినటానికి చాలా కాలం గడిచినట్టుగా అనిపిస్తున్నా.. నాకు అలాంటి ఫీలింగ్ లేదు. తొలి సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్లో నాకు, తారక్ కు ఓకె రూమ్ ఇచ్చారు. నేను 9 గంటలకే పడుకుంటాను. తారక్ మాత్రం 12 గంటల వరకు టివి చూస్తూనే ఉన్నాడు అది వ్యవసాయానికి చెందిన ప్రోగ్రాం . అక్కడ ప్రసారం అయ్యే ఒకే ఒక చానెల్ అది. అది కూడా స్విస్ భాషలో వస్తోంది. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ తారక్ను తిట్టుకుంటాను.

 

నా తొలి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ సక్సెస్కు ముఖ్యకారణం పృథ్వి తేజ స్క్రిప్ట్, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం. అప్పుడే నటుడిగా ఎదుగుతున్న ఎన్టీఆర్ కూడా కొన్ని సీన్స్లో మంచి నటన కనబరిచాడు. నా దర్శకత్వంలో కూడా చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం బెస్ట్ అనిపించింది. సినిమా రిలీజ్ తరువాత విజయయాత్రకు వెళ్లినప్పుడు 19 ఏళ్ల తారక్ను చూసేందుకు అభిమానులు, పెద్ద వయసు వారు కూడా ఎంతో ఉత్సాహం చూపించారు. అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మాలాంటి వారికి స్టూడెంట్ నంబర్ వన్ లాంటి సినిమా రావటం అదృష్టం.' అంటూ ట్వీట్ చేశారు.

స్టూడెంట్ వన్ తో మొదలైన రాజమౌళి విజయయాత్ర సింహాద్రితో పీక్స్ లోకి వెళ్లిపోగా, ఆపై సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి ఇలా... ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతూనే ఉంది. ప్రస్తుతం బాహుబలి 2 తో బిజీగా ఉన్న జక్కన్న మరిన్ని రికార్డులను క్రియేట్ చేయటం ఖాయంగానే చెప్పకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Rajamouli  15 years  Tollywood  Tweets  

Other Articles