బిడ్డ పుట్టక ముందే ఏంటో... | Kareena Kapoor Saif Ali Khan to name their baby Saifeena

Kareena kapoor saif ali khan to name their baby saifeena

Kareena Kapoor Saif Ali Khan to name their baby Saifeena, baby Saifeena, Kareena Kapoor Saif Ali Khan baby, Kareena Kapoor Saif Ali Khan daughter, Saif follows Shahid route, After Shasid kapoor now Saif's turn, Saifeena

Kareena Kapoor Saif Ali Khan to name their baby Saifeena.

కరీనా సైఫ్ బిడ్డ కోసం భలే పేరు...

Posted: 09/27/2016 03:01 PM IST
Kareena kapoor saif ali khan to name their baby saifeena

తమకు పుడుతున్న పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో చాలా ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు బాలీవుడ్ దంపతులు. బిడ్డకు తమ ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పేర్లు పెట్టేసుకుంటూ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు. ఆ మధ్య సినీ మేకర్ ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీలు అదిరా అని పెట్టుకోగా, ఈ మధ్య షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ దంపతులు తమ బిడ్డకు మీషా అని పెట్టేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో జంట ఇప్పుడు వారినే అనుసరిస్తున్నారు.

తమకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరు గురించి నటి కరీనా కపూర్ అప్పుడే వెల్లడించింది. డిసెంబర్ లో తనకు కలిగే సంతానం కోసం ఓ పేరు సూచించామని, అది తన భర్తకు ఎంతగానో నచ్చిందంటూ చెబుతోంది కరీనా. ఇంతకీ ఆ పేరేంటో తెలుసా? సైఫీనా అంట... బేబి మూన్ కోసం త్వరలో దుబాయ్ కి వెళ్లి, కొద్ది రోజుల విశ్రాంతి తరువాత తిరిగి అక్టోబరులో ఇండియాకు వస్తామని చెప్పింది.

కాగా, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ కరీనా ర్యాంప్ వాక్ లతో బయట బాగానే హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. తన సోదరి కరిష్మా కపూర్ కోసం నిర్వహించిన ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొన్న కరీనా. ఎమోషన్ అయ్యి స్టేజీ మీదే ఏడ్చేసింది. అయితే కరీనా చేస్తున్న ఫీట్లపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా బాగానే పేలాయి లేండి. అన్నట్లు మిషా అంటే చిరునవ్వు అని అర్థం, మరి సెఫీనా అంటే మీనింగ్ ఏంటో...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena Kapoor  Saif Ali Khan  Baby Name  Saifeena  

Other Articles

Today on Telugu Wishesh