పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలో వారు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
రాశి లక్షణాలు : భార్యాభర్తలు సహాయసహకారాలు అందించుకుంటూ, కష్టాలను అధిగమిస్తూ సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తారు. వ్యవసాయ, వ్యాపార రంగాల్లో వున్నవారు మంచి ఫలితాలను పొందుతారు. తెలుపురంగు వస్త్రాలను ధరించుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ రాశివారికి 2,7,20,29,38,47 వంటి సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా పరిగణించవచ్చు.