• masa
  • masa
Makara Raasi

ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 2 అవమానం : 4

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘8’. 3, 5, 6, 7, 8 సంఖ్యలతో కూడిన తేదీలు సోమ, మంగళ, శుక్రవారాలతో కలిసి వస్తే యోగప్రదం. రాహు, కేతు జపములు, చండీ పారాయణ, హోమాలు జరిపించడం, శుక్ర, మంగళ వారాల్లో అమ్మవారికి కుంకుమార్చన చేయడం లాంటివి నిత్యం చేస్తే.. గ్రహబలం లభించి సుఖం పొందుతారు. స్త్రీలు ప్రతిదినం ఆదిత్యహృదయ పారాయణ చేయడం మంచిది.

ఈ రాశివారు మనసులో తలచిన కార్యములను నిరాటంకంగా ముందు సాగిస్తారు. ఎక్కువ ధనప్రాప్తి వుంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రభుత్వం వల్ల కష్టం కలుగుతుంది. ప్రతిచిన్నపనికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. శుభకార్యాచరణలు, నూతన గృహ నిర్మాణానికై ప్రయత్నాలు, భూప్రాప్తి వుంటాయి. ఇష్టం పడిచేసే కార్యాల్లో సిద్ధి కలుగుతుంది. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాలు ఈసారి సఫలం అవుతాయి. విదేశీ ప్రయాణం అంత మంచిది కాదు. మనసులో భయాందోళనలకు, సంతానపీడ, వారి ప్రవర్తన ఆందోళన కలిగిస్తాయి.

ఈ రాశి రాజకీయ నాయకులకు మిశ్రమఫలితాలు. ఉద్యోగులు, వ్యాపారులు తమ పై అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇంజనీర్లు, వైద్యులు, స్వయంవృత్తివారు, చిన్నతరహా వ్యాపారస్తులు లాభం వున్న వృద్ది కనిపించదు. విద్యార్థులు కృషికి తగ్గ ఫలితాలు పొందుతారు. కోళ్లు, మత్స్య వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వుండాలి.

సంవత్సర ప్రారంభంలో ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో, ఆర్థిక లావాదేవీల ధనాదాయంలో మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి ఆశించేవారికి బదిలీలు చేసుకోవడం ఉత్తమమైనది. వ్యవసాయదార్లకు, శ్రామికులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కిరాణా షాపులవారికి, మత్స్యకారులకు, చెరుకు రైతులకు మంచి అవకాశాలు లభ్యమవుతాయి. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితాలు లభిస్తే.. ఇంజనీర్లు, విద్యను బోధించే అధికారులకు మంచి స్థానం పొందుతారు. ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహకం లభిస్తుంది.

ధనవృద్ధి, స్థిరాస్థుల క్రయవిక్రయాలలో లాభాలను పొందుతారు. చేతికి అందాల్సిన ధనం తిరిగి లభిస్తుంది. ఇంతకుముందు స్తంభించిన ఆర్థిక లావాదేవీలు తీరిపోతాయి. 

ధనాదాయం అధికం అవ్వడంతో కుటుంబం అభివృద్ధి అవుతుంది. అందరితో సఖ్యతగా వుంటూ.. పిల్లలకు మంచి జ్ఞానాన్ని, దారిని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు.

 సంవత్సర ప్రారంభంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా కుటుంబసభ్యులలో లేదా పెద్ద వయస్కులవారికి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే వీటినుండి త్వరగానే కోలుకోవచ్చు. ధనవ్యయం అధికంగా వెచ్చించాల్సి వుంటుంది. 

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma