Gold, silver price reduced in Hyderabad దిగివస్తున్న బంగారం ధర.. అదే బాటలో వెండి..

Gold silver price reduced in hyderabad

gold rates decreased, gold rates today, silver rates today, today gold rates, gold rates in Hyderabad, Silver rates in Hyderabad, Today gold and silver rates, Gold, silver, prices reduced, hyderabad, 24 carat gold, 22 carat gold, ornamental gold, business, bulleion market

The gold rates have reduced by Rs 130, and the price of silver has also come down by Rs 190 today. In the Hyderabad market, the rate of ten grams of 24 carat gold has declined by Rs 130 and reached Rs 39,810. Similarly, the cost of ten grams of 22 carat gold also lowered by Rs 130 and touched Rs 36,490.

దిగివస్తున్న బంగారం ధర.. అదే బాటలో వెండి..

Posted: 11/16/2019 08:42 PM IST
Gold silver price reduced in hyderabad

సగటు కొనుగోలుదారుడ్ని క్రితం రోజున కలవరానికి గురిచేసిన కుందనం ధర ఇవాళ దిగివచ్చింది. రూ.40 వేలకు పైగా పలికిన నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ బంగారం ధర స్పల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 తగ్గింది. దీంతో ధర రూ.39,810 వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ బంగారు వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ కూడా మందగించింది.

దీంతో కాసింత ప్రతికూల వాతావరణం ఏర్పడిన క్రమంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు బిలియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.130 తగ్గింది. దీంతో ధర రూ.36,490కు దిగొచ్చింది. బంగారంతోనే తన పయనాన్ని కూడా పెనవేసుకున్న సామాన్యుల ఆభరణం వెండి ధర బాటలోనే నడిచింది. వెండి కూడా ఏకంగా కేజీకి రూ.190 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.48,650లుగా కొనసాగుతోంది.

ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,500కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణతతో రూ.37,500కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.190 తగ్గింది. దీంతో ధర రూ.48,650కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  silver  prices reduced  hyderabad  24 carat gold  22 carat gold  ornamental gold  business  bulleion market  

Other Articles